Year Ender 2024: దేశాధినేతల్ని సాగనంపిన జనం-భారత్ లో గట్టెక్కిన మోడీ..!
ఈ ఏడాది అంతర్దాతీయంగా మారుతున్న ప్రజల మనోభావాలకు అద్దం పట్టింది. ముఖ్యంగా అంతర్జాతీయంగా పలు దేశాల్లో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఈ ఏడాది ఆరంభంలో అధికారంలో ఉన్న అధినేతలు కాస్తా ఏడాది మధ్యకు వచ్చేసరికి మాజీలుగా మారిపోయారు. విపక్షంలో ఉన్న పలువురు రాజకీయ నేతలు వారి స్ధానాల్లో ఆయా దేశాధినేతలు అయ్యారు.
అమెరికా, బ్రిటన్ వంటి అగ్రరాజ్యాల నుంచి మొదలుపెట్టి చిన్న దేశాలైన పాక్, శ్రీలంక దాకా ఇదే పరిస్ధితి. ఇందులో భారత్ ఒక్కటే మినహాయింపు.
ఈ ఏడాది చివర్లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమెక్రాటిక్ పార్టీని కాదని రిపబ్లికన్లకు జనం పట్టం గట్టారు. దీంతో జో బైడెన్ స్ధానంలో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అటు బ్రిటన్ లో వరుసగా ప్రధానులు మారడంతో విసుగెత్తిన జనం ఈసారి లేబర్ పార్టీకి పట్టం గట్టారు. దీంతో కైర్ స్టార్మర్ కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. శ్రీలంకలో జరిగిన ఎన్నికల్లో జనం ఈసారి కమ్యూనిస్టులకు అండగా నిలిచారు. దీంతో అనుర దిశనాయకే అధ్యక్షుడిగా పగ్గాలు అందుకున్నారు.

భారత్ లో జరిగిన ఎన్నికల్లో మాత్రం అధికార ఎన్డీయే కూటమికి ప్రజలు మరోసారి ఓటేశారు. అయితే మెజార్టీ మాత్రం బారీగా తగ్గింది.అయినా కూటమిలో టీడీపీ, జేడీయూ సహకారంతో వరుసగా మూడోసారి ప్రధానిగా మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు జూన్, జూలైలో ఫ్రాన్స్ లో జరిగిన ఎన్నికల్లో హంగ్ పార్లమెంట్ తప్పలేదు. దీంతో అధ్యక్షుడు మాక్రాన్ ఫ్రాంకోయిస్ బేరూను ప్రధానిగా నామినేట్ చేశారు. దక్షిణాఫ్రికాలో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్, జపాన్ లో లిబరల్ డెమోక్రాటిక్ పార్టీలు కూడా అనూహ్యంగా పరాజయాలు చవిచూసాయి.
బంగ్లాదేశ్ లో జరిగిన ఎన్నికల్లో అధ్యక్షురాలిగా షేక్ హసీనా ఎన్నికయ్యారు. అయితే ఆరు నెలలకే ప్రజా తిరుగుబాటుతో ఆమె భారత్ కు పారిపోయి వచ్చేశారు. దీంతో అక్కడ మొహమ్మద్ యూసుఫ్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం పనిచేస్తోంది. అటు పాకిస్తాన్ లో జరిగిన ఎన్నికల్లో ఓటర్లు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐపై నిషేధంతో విడిగా పోటీ చేసిన ఆ పార్టీ మద్దతుదారుల్ని గెలిపించారు. అయినా మెజార్టీకి తగిన స్ధానాలు రాకపోవడంతో నవాజ్ షరీఫ్ పార్టీ పీఎంఎల్ తరఫున ఆయన సోదరుడు షెహబాజ్ షరీఫ్ ప్రధాని అయ్యారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications