యోగా: యెమెన్‌లో తప్ప 44 ముస్లీం దేశాలు సహా
న్యూఢిల్లీ: ఈ నెల 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 192 దేశాల్లో యోగా దినోత్సవం ఘనంగా జరిగిందని టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఒక్క యెమెన్‌లో మాత్రం జరగలేదన్నారు. యెమెన్‌లో భారత రాయబార కార్యాలయం లేదని, దీంతో, అక్కడ తప్ప మిగతా అన్ని దేశాల్లో ఉత్సాహంగా నిర్వహించారన్నారు.
44కు పైగా ముస్లిం దేశాల్లోనూ యోగా దినోత్సవాన్ని నిర్వహించారన్నారు. అశాంతితో అట్టుడుకుతున్న యెమెన్‌లో 4 నెలల క్రితం భారత రాయబార కార్యాలయాన్ని మూసేశారని తెలిపారు.

రక్షా బంధన్ వేడుకను ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహించనుందనే అంశంపై కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడలేదు. రక్షాబంధన్ నిర్వహణపై ఇటీవలి కేబినెట్ సమావేశంలో చర్చించారని, దీనికి సంబంధించిన ప్రాథమిక వివరాలను సేకరించే పనిని నలుగురు కేంద్రమంత్రులకు అప్పగించారని మీడియాలో వస్తున్నాయి.












Click it and Unblock the Notifications