వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రష్యాకు గూగుల్ మరో భారీ షాక్-మీడియా యూట్యూబ్ ఛానళ్లు బ్లాక్-ఇప్పటికే యాడ్స్ కట్

|
Google Oneindia TeluguNews

ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర కొనసాగుతోంది. దీనికి ప్రతిగా రష్యాపై ఆంక్షల ప్రభావం కూడా నానాటికీ పెరుగుతోంది. ఇప్పటికే రష్యాపై ఆర్ధిక, వాణిజ్య ఆంక్షలతో పలు దేశాలు, సంస్ధలు విరుచుకుపడుతుండగా..ఇప్పుడు అంతర్జాతీయ సోషల్ మీడియా నెట్ వర్క్ లు సైతం రష్యాకు షాకులిస్తున్నాయి. అమెరికాకు చెందిన గూగుల్ ఇప్పటికే రష్యా కంటెంట్ ను తమ ప్లాట్ ఫామ్ పై బ్లాక్ చేయడంతో పాటు తమ మరో సంస్ధ యూట్యూబ్ సాయంతోనూ కట్టడి చేస్తోంది.

Recommended Video

Russia Ukraine Conflict : Russia పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు Ukraine ఫిర్యాదు | OneindiaTelugu

యూట్యూబ్ ఇప్పటికే రష్యా మీడియాతో పాటు ఇతర వైబ్ సైట్లు, యూట్యూబ్ ఛానళ్లకు ఇచ్చే ప్రకటనలను నిలిపేసింది. దీంతో కోట్లాది రూపాయల ఆదాయాన్ని అవి కోల్పోయాయి. ఇప్పుడు ఏకంగా రష్యన్ మీడియాకు చెందిన ఛానళ్లను సైతం యూట్యూబ్ నిలిపివేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా వాటిలో రష్యా వార్తలు చూసే అవకాశం లేకుండా పోయింది. ముఖ్యంగా రష్యా ప్రభుత్వ అధికారిక మీడియా ఛానళ్లు అయిన ఆర్టీ, స్పుత్నిక్ పై యూట్యూబ్ కన్నెర్ర చేసినట్లు తెలుస్తోంది.

youtube block russian media channels over ukrain invasion, already cut advertisements

రష్యా అధికారిక మీడియా ఛానళ్ల ద్వారా ఉక్రెయిన్ వ్యతిరేక వార్తల్ని, అబద్ధాల్ని ప్రచారం చేస్తోందని ఆరోపిస్తూ యూట్యూబ్ ఈ నిషేధం విధించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్ పోరులో ఎంతమంది చనిపోయారు, ఎన్ని నగరాలను రష్యా సైనికులు స్వాధీనం చేసుకున్నారనే దానిపై వాస్తవ లెక్కలు కనిపించడం లేదు. దీంతో స్ధానిక మీడియా తమ దేశానికి అనుకూలంగా వార్తలు వండి వార్చే క్రమంలో వాస్తవాలను విస్మరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు యూట్యూబ్ ఛానళ్ల నిషేధంతో రష్యా మరింత ఉక్కిరిబిక్కిరవడం ఖాయంగా కనిపిస్తోంది.

English summary
youtube has blocked all russian media channels on its platform due to ukraine invasion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X