జైలులో జల్సాలు చేస్తున్న లష్కర్ ఉగ్రవాది లఖ్వీ

రావల్పిండి: ముంబాయి దాడుల రూపకర్త లష్కర్-ఏ- తోయిబా నాయకుడు , కరుడుకట్టిన ఉగ్రవాది ఝకి- ఉర్- రెహమాన్ లఖ్వీ ఇస్లామాబాద్ లోని రావల్పిండి జైలులో ఉంటు తన కర్యకలాపాలు నిర్వహిస్తున్నాడని వెలుగు చూసింది. ఇతను జైలులో ఉంటునే ఇంటర్నెట్, మొబైల్ ల సహాయంలో తీరిక లేకుండ ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని బీబీసీ మీడియా వెల్లడించింది. ముంబుయి దాడులు జరగడానికి ఇతను ప్రధాన కారణం.

ముంబయి దాడులు జరిగిన తరువాత భారత్ నుండి ఒత్తిడి ఎక్కువ కావడంతో పాకిస్థాన్ ఉగ్రవాది లఖ్వీని అరెస్టు చేసింది. తరువాత న్యాయస్థానం అతనికి బెయిల్ మంజూరు చేసింది. లఖ్వీకి బెయిల్ మంజూరు చెయ్యడాన్ని భారత్ తీవ్రస్థాయిలో వ్యతిరేకించింది. తరువాత లఖ్వీని అరెస్టు చేసి పాకిస్థాన్ లోని రావల్పిండిలో ఉన్న అడ్యాల జైలుకు తరలించారు. లఖ్వీతో పాటు ముంబాయి దాడులతో సంబంధం ఉన్న అబ్దుల్ వాజిద్, మజహర్ ఇక్బాల్, హమద్ అమీన్ సిధ్దిఖి, షాహిద్ జమీల్ రియాజ్, జమీల్ అహమ్మద్, యూనీస్ అంజూమ్ లు అడ్యాల జైలులో ఉన్నారు. వీరందరి మీద ముంబాయి దాడులు కేసులు ఉన్నాయి.

Zaki-ur-Rehman Lakhvis Luxuriou’s Jail life

జైలులో లఖ్వీ కి ప్రత్యేక గది (క్వాటర్స్) కేటాంచారు. సకలసదుపాయాలు కల్పించారు. అత్యాధునికమైన టీవీ, కంప్యూటర్, ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లు ఇచ్చారు. ఎప్పుడైన ఎవరైన లఖ్వీనికి కలవడానికి అవకాశం కల్పించారు. ప్రతి రోజు సరాసరి 100 మంది లఖ్వీని కలుస్తున్నారని బీబీసీ న్యూస్ వెళ్లడించింది. జైలులోని ఇతని గది లగ్జరి అపార్ట్మెంట్లను తలపిస్తున్నదని వెలుగు చూసింది. పేరుకు మాత్రం లఖ్వీ జైలులో ఉన్నాడని, అధికారులు అతనితో పాటు మిగిలిన ఆరు మందికి ఏమి తక్కువ చెయ్యడం లేదని తెలిసింది.

భారత్ ఒత్తిడి చెయ్యడం వలనే లఖ్వీని జైలులో పెట్టారు. అయితే అతను ఎప్పటి లాగే తన ఉగ్రవాద కార్యకాలపాలు నిర్వహిస్తున్నాడు. పాకిస్థాన్ అధికారులు మాత్రం అతనికి పూర్తి సహకారం అందిస్తున్నారు. 2008 నవంబర్ 11వ తేదిన ముంబాయిలో లఖ్వీ రెచ్చగొట్టిన టెర్రరిస్టులు విరుచుకుపడటంతో 166 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అనేక మందికి తీవ్రగాయాలైనాయి. కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఈ దాడులతో భారతదేశం అట్టుడికి పోయింది. ఇంతటి దారుణానికి తెగించిన లఖ్వీకి మాత్రం నేడు పాకిస్థాన్ లో రాచమర్యాదలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+