కీవ్‌ను చుట్టుముట్టిన రష్యా సేనలు: ప్రత్యర్థిని దీటుగా దెబ్బతీద్దాం..! ఉక్రెనియన్లకు జెలెన్‌స్కీ పిలుపు !!
ఉక్రెయిన్‌పై రష్యా సేనలు దాడులను తీవ్రతరం చేశాయి. రాజధాని కీవ్ పట్టణాన్ని స్వాధీనం చేసుకునేదిశగా క్షిపణులతో విరుచుపడుతున్నాయి. కీవ్‌కు నలుమూలలా రష్యన్ బలగాలు చుట్టుముట్టాయి. ఈ దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. మన దేశాన్ని పరిరక్షించుకునేందుకు ఉక్రెనియన్లు పరస్పరం సహాయం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రష్యా స్వాధీనం చేసుకున్న ప్రతి నగరాన్ని పునర్నిర్మిస్తామని స్ఫష్టం చేశారు.

ప్రత్యర్థిని తరిమికొడదాం..
ఉక్రెయిన్ మౌలిక సదుపాయాలను రష్యా విధ్వంసం చేస్తోందని, నగరాలను, పట్టణాలను నాశనం చేస్తోందని జెలెన్‌స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మనవంతా కలిసికట్టుగా పోరాడితే ప్రత్యర్థిపై తప్పక విజయం సాధిమని ధీమా వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ ప్రతిష్టను కాపాడుకుందామని, సైనికులకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. దురాక్రమణ దారులు ఇప్పటికీ మన దేశ భూభాగంలో ఉన్నారు . వారిని మనం దీటుగా దెబ్బతీయాలని పేర్కొన్నారు.

రష్యపై ఒత్తిడి పెంచండి...
మరోవైపు రష్యాపై ప్రపంచ దేశాలు ఒత్తిడి పెంచాలని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా కోరారు. అంతర్జాతీయ కంపెనీలు రష్యాలో తమ కార్యకలాపాలను బహిష్కరించాలని పిలుపు నిచ్చారు. ఇప్పటికే అనేక కంపెనీలు తమ కార్యకలాపాలను నిలిపివేశాయని మిగతా కంపెనీలు కూడా అదే బాటను నడవాలని కోరారు. అటు రష్యా నౌకలు, సరుకుల రవాణాను అడ్డుకోవాలని అంతర్జాతీ నౌకాశ్రయాలకు దిమిత్రో విజ్ఞప్తి చేశారు.

పీడకల కంటే ఎక్కువే..
అటు రష్యా దండయాత్ర ఉక్రెయిన్ దేశ ప్రజల పీడకల కంటే తక్కువేమీ కాదంటూ ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్ డెరెక్టర్ జనరల్ రాబర్ట్ మర్డిని కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ప్రజలను తరలింపునకు మానవతా సాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. రష్యా విధ్యంసానికి పాల్పడిన నగరాల్లో జనం తాగునీరు, ఆహారం కొరతతో అల్లడుతున్నాని పేర్కొన్నారు. మేరియుపోల్‌లో పరిస్థితి అంత్యంత దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు . ఈ నగరంలో ఇప్పటివరకు 2,500 మందికి పైగా మృతి చెందారని మర్డిని విచారం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications