IPL 2023: నేడు తేలిపోనున్న అర్జున్ టెండూల్కర్ భవితవ్యం-ఆశలు వదులుకోని ముంబై ఇండియన్స్..

ఐపీఎల్ 2023 (IPL 2023)లో శుభారంభం కోసం ఎదురుచూస్తున్న ముంబై ఇండియన్స్ ఈసారి కీలక ఆటగాళ్ల తాజా పరిస్దితిని అంచనా వేస్తోంది. ఇందులో భాగంగా ఈ సీజన్ లో కీలకంగా మారతాడని భావిస్తున్న లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్జున్ టెండూల్కర్ పై భారీ ఆశలే పెట్టుకుంది. అయితే గాయంతో ప్రాక్టీస్ కు దూరమైన అర్జున్ కు సంబంధించి తాజా అప్ డేట్ వచ్చింది. దీనిపై కోచ్ మార్క్ బౌచర్ కూడా స్పందించాడు.

ఐపీఎల్ 2023లో ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్జున్ టెండూల్కర్ పై ముంబై ఇండియన్స్ కు భారీ ఆశలే ఉన్నాయి. అయితే గాయం పాలై తాజాగా కోలుకున్న అర్జున్ ఈ సీజన్ కు అందుబాటులో ఉంటాడా లేడా అన్నది మాత్రం ఇంకా తేలలేదు. ముంబై కోచ్ మార్క్ బౌచర్ మాత్రం అర్జున్ టెండూల్కర్ హాజరుపై ఆశావహంగా ఉన్నట్లు చెబుతున్నాడు. ఇవాళ ముంబై ఇండియన్స్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడబోతోంది. ఇందులో అర్జున్ టెండూల్కర్ ఫిట్ నెస్ పై ఓ అంచనాకు వస్తామని కోచ్ బౌచర్ తెలిపాడు.

IPL 2023: Mumbai Indians hopes on arjun tendulkars entry-coach boucher says finalise today

ఇవాళ ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా అర్జున్ టెండూల్కర్ ఫిట్ నెస్ నిరూపించుకుంటే జట్టు సెలక్షన్ కు అందుబాటులో ఉంటాడని ముంబై ఇండియన్స్ కోచ్ మార్క్ బౌచర్ తెలిపాడు. ఈ రాత్రికి ఈ విషయం తేలే అవకాశం ఉందన్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వారసుడైన అర్జున్ టెండూల్కర్ ను ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్ 2021 ఎడిషన్ కు ముందు కొనుగోలు చేసింది. కానీ గాయం కారణంగా ఆ సీజన్ కు దూరమైన అర్జున్.. ఆ తర్వాత 2022 ఎడిషన్ లోనూ కనిపించలేదు. దీంతో ఈసారి అర్జున్ టెండూల్కర్ అరంగేట్రంపై భారీ అంచనాలున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+