ఎవరైనా మీకు అబద్ధం చెబుతున్నారా? ఈ ప్రవర్తనా మార్పులతో గుర్తించండి!!
మానవ సంబంధాలకు నిజాయితీ మూల స్తంభం. అది వ్యక్తిగతమైనప్పటికీ, వృత్తిపరమైనప్పటికీ చాలామంది ప్రతి చిన్న విషయానికి అబద్ధాలు చెబుతూ ఉంటారు. ఎప్పుడు అబద్ధాలు చెప్పే వ్యక్తుల నిజ స్వరూపాన్ని ధ్రువీకరించడం అంత సులభం కాదు. కానీ కొన్ని ప్రవర్తన సంకేతాలు, బాడీ లాంగ్వేజ్ ఎవరైనా మీకు అబద్ధం చెబితే వారు అబద్ధం ఏవిధంగా చెబుతున్నారు? ఆ సమయంలో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు? అనేది అర్థమయ్యేలా చెబుతుంది.
కాబట్టి అబద్ధాలు చెప్పే వారిలో ఉండే కొన్ని లక్షణాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం. అబద్దాలు చెప్పేవారు ఎప్పుడు అస్థిరమైన కథనాలు చెబుతారు. వారు చెప్పే కథలో చాలా అసమానతలు ఉంటాయి. అబద్ధం చెబుతున్నారు అనేది ఇట్టే అర్థమవుతుంది. అంతకు ముందు ఒక విషయానికి సంబంధించి చెప్పిన అంశాలకు, అదే విషయం గురించి మరోమారు చెప్పే అంశాలకు పొంతన లేకుంటే, తేడాలు ఉంటే ఆ వ్యక్తి అబద్ధాలు చెబుతున్నారని అర్థం చేసుకోవాలి.

ఇక ఎప్పటికీ అబద్దాలు చెప్పేవారు మారరు అనే విషయాన్ని గుర్తించి వారి విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం. ఇక అబద్ధాలు చెప్పేవారు అవతలి మనిషిని సూటిగా చూసి చెప్పలేరు. వారు చెబుతున్నది అబద్ధమని వారి చూపు ద్వారానే అర్థమవుతుంది. ఏదైనా సీరియస్ విషయంలో సూటిగా చూసి మాట్లాడడం లేదు అంటే ఆ వ్యక్తి అబద్ధం చెబుతున్నట్టు లెక్క. ఇక అబద్ధాలు చెప్పేవారు తడబడతారు.
మాట్లాడేటప్పుడు ఇబ్బంది పడటం, చెమటలు పట్టడం, ముఖంలో అబద్ధం తాలూకా బెరుకు కచ్చితంగా కనిపిస్తుంది. ఒక్కోసారి అవతలి వ్యక్తి ఏదైనా ఒక విషయానికి సంబంధించి నిజం చెప్పమని ప్రశ్నిస్తే చిరాకును కూడా ప్రదర్శిస్తారు. అబద్ధాలు చెప్పేవారు సాధారణ సమయంలో మాట్లాడిన విధంగా అబద్దాలు చెప్పేటప్పుడు మాట్లాడరు. మాట్లాడే విధానంలోనూ కొంత మార్పు ఉంటుంది.
ఇక డిఫెన్స్ బిహేవియర్ కూడా అబద్దాలు చెప్పే వాళ్లలో ఎక్కువగా ఉంటుంది. నిజాయితీ లేని వ్యక్తిని ఎక్కువగా ప్రశ్నించినప్పుడు ఎదుటి మనిషిపై దాడికి దిగుతాడు. నిందలు వేయడానికి ప్రయత్నిస్తాడు. అడిగిన ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు.
అబద్ధాలు చెప్పేవారు మాట్లాడేటప్పుడు బాడీ లాంగ్వేజ్ లో తేడా ఉంటుంది. వారు చెప్పే అంశాన్ని, ఆ సమయంలో వారి బాడీ లాంగ్వేజ్ ని జాగ్రత్తగా గమనిస్తే అబద్ధం చెబుతున్నాడు అనేది మనకు స్పష్టమవుతుంది. ఇక ఈ పరిశీలన ద్వారా అబద్ధాలు చెప్పే వారిని ఇట్టే గుర్తించొచ్చు. ఇక వారిని మార్చాలి అని ప్రయత్నం చేసే బదులు, అటువంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిదని సలహా ఇవ్వబడింది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications