జగిత్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భర్త కాదు నీచుడు.. భార్య ఫోన్ ట్యాప్, సీక్రెట్ యాప్ ఇన్ స్టాల్, వేధింపులు

|
Google Oneindia TeluguNews

భార్య అంటే భరించడం అనే అర్థమే సూట్ అవుతోంది. భర్త చేసే ఆగడాలు.. అరాచకాలను భరించడం తప్ప మరో మార్గం ఉండటం లేదు. ఇలా అందరూ ఉండకపోవచ్చు.. కానీ కొందరు చేసే టార్చర్ అందరికీ చెడ్డ పేరు వస్తోంది. ఫోన్ లోకి సీక్రెట్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసి భర్త తనను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు తన ఫోన్‌లోని వీడియోలు, సందేశాలు చూసి అనుమానంతో వేధిస్తున్నాడని ఆమె వాపోయింది.

జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన టి. నర్సింహాచలం తన భార్య అనిత ఫోన్‌లో ఓ సీక్రెట్ యాప్ ఇన్‌స్టాల్‌ చేశాడు. ఈ విషయం ఆమెకు తెలియదు. ఈ యాప్ ద్వారా ఆమె ఎక్కడెక్కడికి వెళ్తుంది. ఎవరితో ఫోన్ మాట్లాడుతుంది అనేవి తన ఫోన్ నుంచే ఆ యాప్ ద్వారా చూస్తుండేవాడు. అంతేకాదు ఆమె ఫోన్‌ను ఎక్కువగా భర్తే ఆపరేట్ చేసేవాడు. వాట్సాప్‌ చాటింగ్‌ చూడటం, ఆడియో రికార్డింగ్ వినడం వంటివి చేస్తుండేవాడు. భర్త తన ఫోన్ లో రహస్య యాప్ ఇన్‌స్టాల్‌ చేసిన విషయం తెలుసుకునేందుకు చాలా కాలమే పట్టింది. విషయం తెలియడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

husband tap wife mobile with secret app

అనిత ఫిర్యాదుతో ఆమె భర్త టి. నర్సింహాచలంను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. రహస్య యాప్ ఇన్‌స్టాల్‌ చేసినట్లు అంగించారించాడు. కొన్నేళ్ల క్రితం తమ ఇంట్లో బంగారం పోయిందని, అది ఎవరు తీశారనే విషయం తెలుసుకునేందుకే తాను ఈ పని చేశానని తెలిపాడు. భార్య ఫోన్ తోపాటు మరో ఇద్దరు బంధువుల ఫోన్లలో కూడా ఈ రహస్య యాప్ ఇన్‌స్టాల్‌ చేసినట్లు వివరించాడు. దీంతో నర్సింహాచలంపై 498, 354 (సీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సీఐ రాజశేఖర రాజు తెలిపారు.

కలికాలం అంటే ఇదే మరీ.. కట్టుకున్న భార్యను అనుమానించడం సరికాదు. అందుకోసం యాప్ ఇన్ స్టాల్ చేసి మరీ వేధించాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించే సరికి.. బంగారం పోయిందని కట్టుకథ చెప్పాడు.

English summary
husband tap wife mobile with secret app. incident happen at jagtial district koratla.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X