Crime News: జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి.. మరో ఇద్దరి పరిస్థితి విషమం..

లారీ ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఎనిమిది మంది గాయపడిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో కండక్టర్ మరణించాడు. జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వరంగల్ కు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. జగిత్యాల - కరీంనగర్ ప్రధాన రహదారిపై దొంగల మర్రి వద్ద లారీ, ఆర్టీసి బస్సు ఢీ కొట్టింది. ఈఘటన కొండగట్టు సమీపంలోని బల్వంతాపూర్ వద్ద జరిగింది. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఆర్టీసీ బస్సు జగిత్యాల నుంచి కరీంనగర్ వెళ్తుండగా.. లారీ కరీంనగర్ నుంచి జగిత్యాల వైపు వస్తుంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు 108 కాల్ చేశారు. వీలైనంత మందిని బస్సులోంచి బయటకు తీశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడ్డవారిని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం తెల్లువారుజాము 4 నుంచి 5 గంటల మధ్య జరిగినట్లు తెలుస్తోంది.

One person died in a road accident at Kondagattu in Jagityala district

ప్రమాద సమయంలో ప్రయాణికులు నిద్రలో ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. లారీ డ్రైవర్ మద్యం సేవించి లారీ నడిపడా.. లేక బస్సు డ్రైవర్ నిద్ర మత్తులో ఉన్నాడ అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే కరీంనగర్ జగిత్యాల రహదారిలో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యం అవుతున్నాయి. ఈ రహదారిపై ఏదో చోట రోడ్డు ప్రమాదం జరిగుతోంది.

కొద్ది సంవత్సరాల క్రితం కొండగట్టు నుంచి బస్సు కింది వస్తుండగా అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటన లో 50కి పైగా మంది ప్రాణాలు కోల్పోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+