కళ్యాణ లక్ష్మీ ఇచ్చేందుకు కదిలిన యంత్రాంగం .. కానీ కాపురం నిలబెట్టగలరా ?

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న కళ్యాణ లక్ష్మి పథకం ఒక వివాహిత కాపురానికి చేటు చేసింది. జగిత్యాల జిల్లాలో కళ్యాణ లక్ష్మి చెక్కు అందకపోవడంతో కళ్యాణ లక్ష్మి చెక్కు తీసుకుంటేనే ఇంటికి రావాలని ఓ 19 ఏళ్ల యువతిని భర్త నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి గెంటివేసిన ఘటన చోటు చేసుకుంది. ఇక ఈ ఘటన రాష్ట్ర వ్యాప్త సంచలనం కలిగించింది. దీనిపై స్పందించిన అధికారులు యుద్ధ ప్రాతిపదికన కళ్యాణ లక్ష్మీ చెక్కు మంజూరు చెయ్యాలని సంకల్పించి ఆ ప్రాసెస్ ప్రారంభించారు.

కళ్యాణ లక్ష్మీ చెక్ కోసం భార్యను గెంటేసిన భర్త ... సరిత విషయంలో అధికారుల స్పందన

కళ్యాణ లక్ష్మీ చెక్ కోసం భార్యను గెంటేసిన భర్త ... సరిత విషయంలో అధికారుల స్పందన

జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలం లోని గుడి పేటకు చెందిన రమేష్ చెవిటి సరితను వివాహం చేసుకున్నారు. వీరి కాపురం కొంత కాలం సజావుగానే సాగింది. కానీ కళ్యాణ లక్ష్మీ చెక్ వీరి కాపురంలో చిచ్చు పెట్టింది వివాహ సమయంలో సరిత యొక్క బంధువులు ఒక లక్ష 116 రూపాయలు కట్నంగా ఇస్తామని వరుడితో చెప్పారు. కళ్యాణ లక్ష్మి చెక్ రాగానే ఆ డబ్బు తీసుకోవాలని వరుడు కి సూచించారు. అయితే కళ్యాణ లక్ష్మి చెక్ కోసం ఆరు నెలల పాటు నిరీక్షించిన రమేష్ ప్రభుత్వం నుండి కల్యాణలక్ష్మి చెక్ తీసుకున్న తర్వాతనే కాపురం చేయడానికి ఇంటికి రావాలని అప్పటి వరకూ తన పుట్టింట్లోనే ఉండాలని సరితను నిర్దాక్షిణ్యంగా గెంటివేశాడు. ఇక ఈ విషయం తెలియటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.

చెక్ మంజూరు చేసిన ఆర్డీవో .. మూడురోజుల్లో సరితకు కల్యాణ లక్ష్మి చెక్కు అందజేయనున్న అధికారులు

చెక్ మంజూరు చేసిన ఆర్డీవో .. మూడురోజుల్లో సరితకు కల్యాణ లక్ష్మి చెక్కు అందజేయనున్న అధికారులు

సరితకు చెక్ జారీ చెయ్యటానికి కరీంనగర్‌ ఆర్డీవో ఆనంద్‌కుమార్‌ స్పందించి సరిత దరఖాస్తును కార్యాలయానికి తీసుకురావాలని తహసీల్దార్‌ కవితను ఆదేశించారు. ఎమ్మెల్యే వద్ద ఉన్న దరఖాస్తును ఆర్డీవో ఆదేశాలతో తహసీల్దార్‌ కరీంనగర్‌ చేర్చారు. పరిశీలించిన అనంతరం ఆర్డీవో సంతకం చేసి ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. సరిత ఫైల్‌ను పరిశీలించి చెక్‌ను మంజూరు చేస్తూ ట్రెజరీ కార్యాలయానికి కూడా పంపించారు. మూడురోజుల్లో సరితకు కళ్యాణ లక్ష్మి చెక్కును అందజేయనున్నట్లు ఆర్డీవో తెలిపారు. ఇక కళ్యాణ లక్ష్మి చెక్కు అందితే భర్త కాపురానికి తీసుకెళ్తాడని గంపెడు ఆశతో ఎదురు చూస్తుంది సరిత.

 కళ్యాణ లక్ష్మీ చెక్ ఇప్పుడు కాపురం నిలుపుతుందా ? భర్త సరితను తీసుకెళ్తాడా?

కళ్యాణ లక్ష్మీ చెక్ ఇప్పుడు కాపురం నిలుపుతుందా ? భర్త సరితను తీసుకెళ్తాడా?


మరి సరిత భర్త రమేష్ ఇప్పటికైనా ఆ యువతిని కాపురానికి తీసుకు వెళ్తాడా లేదా అన్నది ప్రస్తుతం అందరి ముందున్న ప్రశ్న . ఎందుకంటే సరితకు కళ్యాణ లక్ష్మి అందకపోవటం వల్ల భర్తకు దూరమైంది. ఇక ఈ వార్త మీడియాలో రావటంపై ఇప్పటి వరకు భర్త స్పందించలేదు. భార్యను తీసుకెళ్తానని చెప్పలేదు . ఇక కట్నం డబ్బుల కోసం పుట్టింటికి పంపాడన్న వార్త సహజంగానే అతనికి ఆగ్రహం తెప్పిస్తుంది . ఇప్పుడు కళ్యాణ లక్ష్మీ చెక్ ఇచ్చినంత మాత్రాన రమేష్ , సరితల కాపురం చక్కబడుతుందని భావించలేము. వీరి కాపురం చక్కదిద్దటానికి అధికారులు చొరవ చూపి రమేష్ తో మాట్లాడి సరితను పంపిస్తే బాగుంటుందని స్థానికులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+