ఇంట్రెస్టింగ్: తెలంగాణలో ట్రంప్ విగ్రహం ...ప్రత్యేక పూజలందుకున్న అమెరికా అధ్యక్షుడు
జనగాం: సాధారణంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటే చాలామంది చీధరించుకుంటారు. ఆయన చేసే వెక్కిలి చేష్టలకు, పాలనాపరమైన నిర్ణయాలు అడ్డగోలుగా తీసుకోవడం, అనవసరంగా నోరుజారడం వంటితో చాలామంది ట్రంప్‌ను ఈసడించుకుంటారు. అదే సమయంలో ఆయన్ను ఆకాశానికి ఎత్తేసేవారు కూడా ఉన్నారు. ఆయనంటే ప్రేమ ఒలకబోసే వారు కూడా ఉంటారు. ట్రంప్ కఠినంగా ఉంటేనే చూడ ముచ్చటగా ఉంటారని చెప్పేవారు లేకపోలేదు. ఇంకా చెప్పాలంటే ట్రంప్‌కు విగ్రహాలు కట్టి పూజించే భక్తులు కూడా ఉన్నారు. ఏంటి నమ్మలేకపోతున్నారా..? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.

ట్రంప్‌కు కృష్ణ వీరాభిమాని
డొనాల్డ్ ట్రంప్...అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ప్రధానాంశాల్లో పేరు వినిపిస్తూ ఉంటుంది. ట్రంప్ పాలనలో కొంత కొత్తదనం కనిపిస్తున్నప్పటికీ ఆయన తీసుకునే పాలనాపరమైన నిర్ణయాలు చాలామందికి ఇబ్బందిగానే కనిపిస్తుంది. అంతెందుకు అమెరికాలో నివసించేవారే ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకిస్తుంటారు. అలాంటి డొనాల్డ్ ట్రంప్ అసలు సిసలైన భక్తుడిని సంపాదించుకున్నాడు. ఆ భక్తుడు ఉండేది ఎక్కడో కాదు. మన తెలంగాణలోనే. జనగాం జిల్లాలోని కొన్నే గ్రామానికి చెందిన బుస్సా కృష్ణ అనే 32 ఏళ్ల వ్యక్తి ట్రంప్‌కు వీరాభిమాని.

ఆరడుగుల ట్రంప్ విగ్రహం ఏర్పాటు
బుస్సా కృష్ణ ఎంతటి అభిమాని అంటే ఏకంగా ఆయనకు ఒక విగ్రహమే కట్టించేశాడు. అంతేకాదు ప్రతిరోజూ పూజలు కూడా చేస్తాడు. ఇంతకీ ఆ విగ్రహం ఎత్తు ఎంతో తెలుసా అచ్చం ట్రంప్ ఉన్నంత హైటే. అంటే ఆరడుగుల విగ్రహాన్ని బుస్సా కృష్ణ కట్టించాడు. ఇప్పటికే భారత్ అమెరికాల మధ్య వాణిజ్యం యుద్ధం జరుగుతున్న క్రమంలో కృష్ణ ట్రంప్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై సర్వత్రా చర్చకు దారితీస్తోంది. అంతేకాదు ట్రంప్ విగ్రహానికి తిలకం దిద్ది, పూలమాల వేసి అభిషేకం చేసి హారతి కూడా ఇచ్చాడు. జై జై ట్రంప్ అంటూ నినాదాలు చేశాడు.

ట్రంప్ యాటిట్యూడ్‌కు ఫిదా అయిన కృష్ణ
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటే తనకు అభిమానమని చెప్పిన కృష్ణ.. అగ్రరాజ్యపు అధ్యక్షుడు తీసుకునే కఠినమైన నిర్ణయాలు తనను ఆకట్టుకుంటున్నాయని చెప్పాడు. అంతేకాదు ట్రంప్ ఆటిట్యూడ్ తనను కట్టిపడేస్తుందని వివరించాడు కృష్ణ. ఏదో ఒక రోజు అగ్రరాజ్యపు అధినేతను కలుస్తాననే ధీమా వ్యక్తం చేశాడు ట్రంప్. ఇక ట్రంప్ విగ్రహం ఏర్పాటుకు కృష్ణ రూ.1.30 లక్షలు ఖర్చు చేసినట్లు ఆమె తల్లి తెలిపింది. విగ్రహావిష్కరణ తర్వాత గ్రామస్తులకు విందు భోజనం కూడా కృష్ణ ఏర్పాటు చేశాడు. జూన్ 14న ట్రంప్ తన 73వ పుట్టిన రోజును జరుపుకున్నారు. ఆ సమయంలో కృష్ణ తన ఇంటి బయట ఓ పెద్ద పోస్టరు పెట్టి ట్రంప్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
-
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications