కన్నా సూపర్ స్కెచ్: ఆది కోసం లాబీయింగ్- జమ్మలమడుగులో మారిన ఈక్వేషన్స్

బీజేపీ రాష్ట్రశాఖ ఉపాధ్యక్షుడు సీ ఆదినారాయణ రెడ్డి మళ్లీ తెలుగుదేశం పార్టీలోకి వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన కోసం కన్నా లక్ష్మీనారాయణ లాబీయింగ్ చేస్తోన్నట్లు సమాచారం.

కడప: భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.. ఇవ్వాళ తెలుగుదేశంలో చేరనున్నారు. ఇప్పటికే ఆయన బీజేపీకి రాజీనామా చేశారు. ఇంకాస్సేపట్లో తన అనుచరులతో పెద్ద ఎత్తున ర్యాలీగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి బయలుదేరి వెళ్లనున్నారు. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడి సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. దీనికి అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.

సీనియర్ల కోసం..

సీనియర్ల కోసం..

ఏపీ బీజేపీ సీనియర్ నేతల కోసం ఆయన లాబీయింగ్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరించే నాయకులను టీడీపీలోకి చేర్చుకునేలా స్కెచ్ వేశారని సమాచారం. కొందరు సీనియర్ నేతలతోనూ కన్నా లక్ష్మీనారాయణ మంతనాలు సాగించారనే ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా రాయలసీమలో బీజేపీ క్రియాశీలక నేతలను లైన్ లో పెట్టారని చెబుతున్నారు.

ఆదినారాయణ రెడ్డి కోసం..

ఆదినారాయణ రెడ్డి కోసం..

ఈ క్రమంలో బీజేపీ రాష్ట్రశాఖ ఉపాధ్యక్షుడు, కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన సీనియర్ నేత చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డితో మంతనాలు సాగించారని అంటున్నారు. ఇదివరకు తెలుగుదేశం పార్టీలో పని చేసిన ఆదినారాయణ రెడ్డి.. 2019 సార్వత్రిక ఎన్నికల తరువాత బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. చంద్రబాబు ప్రభుత్వంలో మార్కెటింగ్ శాఖ మంత్రిగానూ పని చేశారాయన. టీడీపీ అభ్యర్థిగా కడప లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. పార్టీ అధికారంలోకి రాకపోవడంతో బీజేపీలో చేరారు.

ఇప్పుడు మళ్లీ..

ఇప్పుడు మళ్లీ..

ఇంకో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి మరోసారి తెలుగుదేశం పార్టీలో చేరొచ్చని చెబుతున్నారు. ఆయన కోసం చంద్రబాబు వద్ద కన్నా లక్ష్మీనారాయణ లాబీయింగ్ చేస్తోన్నారని తెలుస్తోంది. బీజేపీలో చేరినా కూడా తెలుగుదేశం పార్టీతో సన్నిహిత సంబంధాలనే ఆదినారాయణ రెడ్డి కొనసాగిస్తోన్నారని, ఆయన రాకను చంద్రబాబు వ్యతిరేకించడానికి ఎలాంటి కారణాలు లేవని చెబుతున్నారు.

వైసీపీ కోటలో..

వైసీపీ కోటలో..

అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట వంటి జిల్లాల్లో కడప కూడా ఒకటి. ఇక్కడ ఎంతమంది బలమైన స్థానిక నాయకులను పార్టీలోకి చేర్చుకుంటే అంత మంచిదనే అభిప్రాయంతో చంద్రబాబు ఉన్నారని, ఇందులో భాగంగా వైసీపీ వ్యతిరేక నాయకులను ఏకం చేయడం ద్వారా ఆ పార్టీని- ధీటుగా ఎదుర్కొవచ్చని భావిస్తున్నారని అంటున్నారు. ఆదినారాయణ రెడ్డిని టీడీపీలోకి చేర్చుకోగలిగితే- జమ్మలమడుగులో పార్టీ బలపడుతుందనే అంచనా వేస్తోన్నట్లు సమాచారం.

కొడుకు టికెట్..

కొడుకు టికెట్..

ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు గనక టీడీపీలో చేరితే- 2024 నాటి సార్వత్రిక ఎన్నికల్లో జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి ఆయన అన్న నారాయణ రెడ్డి కుమారుడు భూపేష్ రెడ్డికి టికెట్ ఇవ్వడానికి ఇక ఎలాంటి అభ్యంతరాలూ ఉండవని అటు పార్టీ నాయకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆదినారాయణ రెడ్డి బీజేపీలో- అన్న కుమారుడు భూపేష్ రెడ్డి టీడీపీలో కొనసాగుతున్నారు. ఆది.. టీడీపీలో చేరితే భూపేష్ రెడ్డి గెలుపు కోసం ఆయన వర్గం కూడా పని చేస్తుందని అంచనా వేస్తోన్నారు.

పొన్నపురెడ్డికి ఎమ్మెల్సీతో మారిన ఈక్వేషన్లు

పొన్నపురెడ్డికి ఎమ్మెల్సీతో మారిన ఈక్వేషన్లు

గతంలో ఇదే జమ్మమడుగు నుంచి తెలుగుదేశం పార్టీకి పని చేసిన మాజీ మంత్రి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో కొనసాగుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనను ఇటీవలే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. దీనితో జమ్మలమడుగు నియోజకవర్గం వైసీపీలో ఉన్న అంతర్గత విభేదాలు కూడా పూర్తిగా సమసిపోయినట్టయింది.

తిరుగులేని వైసీపీ..

తిరుగులేని వైసీపీ..

జమ్మలమడుగు నియోజకవర్గంలో వైసీపీ మరింత బలోపేతమైంది. ప్రస్తుత శాసన సభ్యుడు డాక్టర్ మూలె సుధీర్ రెడ్డి-పొన్నపురెడ్డి వర్గాలు ఏకం కావడం కలిసొచ్చింది. దీన్ని ఎదుర్కొనాలంటే ఆదినారాయణ రెడ్డి బీజేపీలో.. భూపేష్ రెడ్డి టీడీపీలో ఉంటే సాధ్యం కాదనే అభిప్రాయాలు ఉన్నాయి. ఆదినారాయణ రెడ్డిని చేర్చుకోవడం వల్ల ఆయన వర్గం కూడా టీడీపీకి పని చేస్తుందని.. గట్టిపోటీ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+