జగన్ కుటుంబంలో విషాదం : వైయస్ వివేకా కన్నుమూత : పులివెందులకు జగన్..!
వైసిపి అధినేత జగన్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన చిన్నాన్న..వైయస్సార్ సోదరుడు వైయస్ వివేకా నంద రెడ్డి తెల్లవారు జామున గుండె పోటుతో మరణించారు. వ్యవసాయ రంగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వివేకానంద నాడు వైయస్ కు..నేడు జగన్ కు రాజకీయంగా చేదోడు వాదోడుగా ఉన్నారు. ఆయన ఆకస్మిక మృతి జగన్ కుటుంబం లో విషాదాన్ని నింపింది.
జగన్ కుటుంబంలో తీరని విషాదం
వైయస్ వివేకానంద రెడ్డి ఆకస్మిక మరణం జగన్ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. నిన్నటి వరకు లోటస్ పాండ్ లో పార్టీ ఎన్నికల ప్రచారం లో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలని అనే అంశం పై జగన్ తో చర్చించారు. గురువారం పులివెందుల లో ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన ఈ తెల్లవారు జామున గుండెపోటుతో మరణించారు. సడన్ గా ఈ వార్త తెలియటంతో జగన్ కుటుంబం షాక్ కు గురైంది. వైయ్ససార్ నుండి జగన్ వరకు రాజకీయంగా మధ్యలో కొంత కాలం విభేదించినా...ఆయన వైయస్సార్ కుటుంబంలో కీలకంగా వ్యవహరించారు. 1950 ఆస్సగు 8న జన్మించిన వైయస్ వివేకా జన్మించారు. వ్యవసాయ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వివేకా.. వైయస్ రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయంలో కడప ఎంపీగా వివేకా పని చేసారు. 1999,2004 లో వివేకా కడప ఎంపీగా పని చేసారు. 1989, 1994 లో పులివెందుల ఎమ్మల్యేగానూ ఆయన పని చేసారు.

జగన్ తో తొలుత దూరంగా..
ఇక, జగన్ పార్టీ ఏర్పాటు చేసిన సమయంలో ఆయన జగన్ తో కలవలేదు. ఆ సమయంలో విజయమ్మ పైనే పోటీ చేసారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో వ్యవసాయ శాఖా మంత్రిగా పని చేసారు. ఎమ్మెల్సీగా వ్యవహరించారు. పులి వెందుల లో పరాజయం తరువాత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసారు. వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయం లో కడప రాజకీయాలను పూర్తిగా వివేకా పర్యవేక్షించేవారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసి జగన్కు మద్దతు ప్రకటించారు. ఆ తరువాత కడప లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఓడిపోయారు. నాలుగు రోజులుగా లోటస్ పాండ్ లో ఉంటూ..అక్కడికి వచ్చిన అసంతృప్తులను బుజ్జగించారు. పులివెందుల లో జగన్ తరపున ఆయన గురువారం ప్రచారం ప్రారంభించారు. ఇప్పుడు సడన్ గా ఈ షాకింగ్ న్యూస్ మొత్తం వైసిపి లో షాకింగ్ న్యూస్ గా మారింది. జగన్ కుటుంబం హుటాహుటిన పులివెందులకు పయనమైంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications