Gun Fire: పులివెందులలో కాల్పుల కలకలం.. వివేకా హత్య కేసుతో లింక్..!
వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఘటనతో పులివెందుల వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఓ ఘర్షణ కారణంగా కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. భరత్ కుమార్ అనే వ్యక్తికి దిలీప్ అనే వ్యక్తి గొడవ జరిగినట్లు తెలిసింది. గొడవ ఘర్షణగా మారడంతో భరత్ దిలీప్ తో పాటు మరొకరిపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో దిలీప్, మహబూబ్ భాషా గాయపడ్డారు. వీరిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. నిందితుడు భరత్ కుమార్ కోసం గాలిస్తున్నారు. అయితే భరత్ కుమార్, దిలీప్ మధ్య ఆర్థిక వివాదాలు ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఇందుకు సంబంధించి వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. కోపంలో భరత్ యాదవు తన వెంట తెచ్చిన తుపాకీతో కాల్పులు జరిపారు.

భరత్ కుమార్ తమపై ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడని కాల్పుల్లో గాయపడిన మహబూబ్ బాషా చెప్పాడు. భరత్‌కుమార్ యాదవ్‌ను వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు గతంలో విచారించారు.













Click it and Unblock the Notifications