జ‌గ‌న్ డ్రీం కేబినెట్ ఇదే..: అధికారంలోకి వ‌స్తే మంత్రులు వీరే : శాఖ‌లు డిసైడ్ చేసేసారు..!

Recommended Video

    జ‌గ‌న్ డ్రీం కేబినెట్ ఇదే... మంత్రులు మరియు వారి శాఖలు ఇవే..!! || Oneindia Telugu

    ఏపీలో ఎన్నిక‌ల ఫల‌తాలు వెల్ల‌డి కాలేదు. ఇందుకు మ‌రో వారం రోజులు స‌మ‌యం ఉంది. కానీ, వైసీపీ నేత‌లు మాత్రం త‌మ‌దే అధికారం అనే ధీమాలో ఉన్నారు. ఆ ధీమా అంత‌టితో ఆగ‌లేదు. కేబినెట్‌లో ఎవ‌రు ఉంటారు.. ఎవ‌రికి ఏ మంత్రి ప‌ద‌వి ఇస్తార‌నే దాని పైనా ఎవ‌రి అంచ‌నాలు వారికి ఉన్నాయి. జ‌గ‌న్ డిసైడ్ చేయాల్సిన పేర్లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఆ పేర్ల‌ను సోష‌ల్ మీడియాలో స‌ర్క్యులేష‌న్‌లో పెట్టేసారు.

    జ‌గ‌న్ డ్రీం కేబినెట్..
    ఎన్నిక‌ల ఫ‌లితాలు రాక ముందే వైసీపీ నేత‌లు ఊహ‌ల్లో విహ‌రిస్తున్నారు. పార్టీ అధినేత జ‌గ‌న్..ఎన్నిక‌ల బ‌రిలో ఉన్న వారు ఫ‌లితాల కోసం ఉత్కంఠ‌గా చూస్తున్నారు. కాన‌,ఈ కొంద‌రి అభిమానం మాత్రం ఆకాశ‌మే హ‌ద్దుగా మారింది. దీంతో జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అవ్వ‌టం ఖాయ‌మ‌ని చెబుతూనే..జిల్లాల వారీగా ఎవ‌రికి మంత్రి ప‌ద‌వులు ద‌క్కే ఛాన్స్ ఉందీ అనేది చ‌ర్చ‌ల రూపంలోకి తీసుకొచ్చారు. అంత‌టితో ఆగ‌లేదు. ఏకంగా వారికి ఏ మంత్రి ప‌ద‌వులు ఇవ్వాలో కూడా డిసైడ్ చేసేసారు. ఈ మంత్రుల పేర్ల‌ను..వారి శాఖ‌ల‌ను సోష‌ల్ మీడియాలో పెట్టేసారు. ఇంకేముంది.. ఫ‌లితాల ముందుగానే కాబోయే మంత్రులంటూ వారి పేర్లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ప్ర‌చారంలో ఉన్న పేర్లు చూస్తే..

    Jagan Dream Cabinet decided with port folios : List circulating in YCP

    మంత్రులు.. శాఖ‌లు..
    ముఖ్యమంత్రి : వై యస్ జగన్మోహన్ రెడ్డి
    స్పీకర్ : దగ్గుబాటి వెంకటేశ్వర రావు
    డిప్యూటీ స్పీకర్ : పాముల పుష్ప శ్రీవాణి
    రెవిన్యూ : ధర్మాన ప్రసాద రావు
    హోమ్ : పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి
    ఫైనాన్స్ : బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి
    రోడ్స్ & భవనాలు : బొత్స సత్యనారాయణ
    భారీ నీటి పారుదల : కోడలి శ్రీ వెంకటేశ్వర రావు
    మున్సిపల్ : గడికోట శ్రీకాంత్ రెడ్డి
    స్త్రీ శిశువు సంక్షేమం : తానేటి వనితా
    పౌర సరఫరాలు : పిల్లి సుభాష్ చంద్రబోస్
    వైద్య : అవంతి శ్రీనివాస్
    విద్య : కురసాల కన్నబాబు
    బీసీ సంక్షేమం : తమ్మినేని సీతారాం
    అటవీ శాఖ : శిల్ప చక్రపాణి రెడ్డి
    న్యాయ శాఖ : వై. విశ్వేసర రెడ్డి
    దేవాదాయ : కోన రఘుపతి
    పంచాయతీ రాజ్ : ఆనం రాంనారాయణ రెడ్డి
    ఐటీ : మోపిదేవి వెంకటరమణ
    విద్యుత్ శాఖ : ఆర్. కే. రోజా
    మైనింగ్ : బాలినేని శ్రీనివాస్ రెడ్డి
    సినిమాటోగ్ర : గ్రంధి శ్రీనివాస్
    కార్మిక, ట్రాన్స్ పోర్ట్ : ఆళ్ళ నాని
    సాంగిక సంక్షేమం : k. భాగ్యలక్ష్మి
    వ్యవసాయం : ఆళ్ళ రామకృష్ణ రెడ్డి
    మార్కెటింగ్, పశుసంవర్థకం : అమంచి కృష్ణ మోహన్
    టూరిజం, తెలుగు సంస్కృతి : కె. ఇక్బాల్ అహ్మద్
    గృహ నిర్మాణం : కొక్కిలిగడ్డ రక్షణనిధి
    ఇండస్ట్రీస్ : కాకాని గోవర్ధన్ రెడ్డి

    వైసీపీ స్పందించాలి..
    ఇప్ప‌టికే ఎవ‌రూ ఫ‌లితాల మీద అతిగా స్పందించ‌వ‌ద్ద‌ని వైసీపీ అధినాయ‌క‌త్వం సూచించింది. అయితే, జ‌గ‌న్ ఆలోచ‌న ఇదే నంటూ కొంత మంది పోస్టింగ్‌లు పెడుతున్నారు. మ‌రి..ఇప్పుడు వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+