Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తండ్రీకూతుళ్ల ఆత్మహత్య కలకలం... అల్లుడే కారణం...? అరెస్ట్ చేసిన పోలీసులు...

కడప జిల్లాకు చెందిన ధనిరెడ్డి బాబుల్ రెడ్డి,ఆయన ఇద్దరు కుమార్తెల ఆత్మహత్య జిల్లాలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు బాబుల్ రెడ్డి అల్లుడు సురేష్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేశారు. తన చావుకు కారణం సురేష్ కుమార్ రెడ్డే అని బాబుల్ రెడ్డి ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బాబుల్‌రెడ్డి పెద్ద కూతురు శ్వేతతో తాళ్లమాపురం గ్రామానికి చెందిన సురేష్‌కుమార్‌రెడ్డికి ఏడాది క్రితం వివాహం జరిగింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నానని చెప్పడంతో బాబుల్ రెడ్డి సురేష్ రెడ్డికి తన కూతురునిచ్చి పెళ్లి చేశాడు. కానీ పెళ్లి తర్వాత అతను సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కాదని తేలింది. దీంతో సురేష్,శ్వేతల మధ్య మనస్పర్థలు తలెత్తాయి.

ఇదే క్రమంలో బాబుల్ రెడ్డి అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు. పుట్టింటి నుంచి డబ్బు తీసుకురావాలని ఒత్తిడి చేసేవాడు. మరో మహిళతో వివాహేతర సంబంధం కూడా పెట్టుకున్నాడు. అప్పటినుంచి శ్వేతను నిత్యం వేధింపులకు గురిచేస్తున్నాడు. అల్లుడి తీరుతో తీవ్ర మనస్తాపం చెందిన బాబుల్ రెడ్డి పలుమార్లు అతనితో మాట్లాడి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. పెద్దల సమక్షంలో ఎన్నిసార్లు పంచాయతీ పెట్టినా సురేష్ ప్రవర్తనలో మార్పు రాలేదు.

police arrested suresh reddy in babul reddy and his daughters suicide case in kadapa

కూతురి జీవితం నాశనమైందన్న బాధతో బాబుల్ రెడ్డి ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు తన సెల్‌ఫోన్‌లో సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు. తన ఆత్మహత్యకు కారణమని సురేష్ రెడ్డే అని పేర్కొన్నాడు. తన కూతురికి న్యాయం చేయాలని వీడియో ద్వారా పోలీసులను కోరాడు. తండ్రి మరణాన్ని తట్టుకోలేక బాబుల్‌రెడ్డి కుమార్తెలు శ్వేత, సాయిప్రీతిలు కూడా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.

ఈ సంఘటనలపై బాబుల్ రెడ్డి మేనల్లుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాజాగా సురేష్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+