సీఎం జగన్మోహన్ రెడ్డికి రాయలసీమ విద్యార్థుల హెచ్చరిక
అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎక్కడ ఉండాలన్న అంశం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. హైకోర్టును రాయలసీమలో పెట్టాలంటూ ఆ ప్రాంత న్యాయవాదులు, ప్రజలు కోరుతుంటే.. తమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలంటూ ఉత్తరాంధ్రకు చెందిన న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. ఇక హైకోర్టును అమరావతి నుంచి తరలిస్తే ఊరుకునేది లేదని ఇక్కడ న్యాయవాదులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం.

విద్యార్థులకు న్యాయవాదుల మద్దతు
ఈ నేపథ్యంలో కర్నూలులో హైకోర్టుతోపాటు రాజధాని కూడా ఏర్పాటు చేయాలంటూ రాయలసీమ విద్యార్థి జేఏసీ డిమాండ్ చేస్తోంది. అంతేగాక, ఈ డిమాండ్‌తో శనివారం కర్నూలు కలెక్టరేట్‌ను ముట్టడించారు. వీరికి ఈ ప్రాంత న్యాయవాదులు కూడా మద్దతు పలికారు. దీంతో విద్యార్థులు తమ ఆందోళనలను ఉధృతం చేస్తున్నారు.

సీఎం జగన్ ఇంటినీ ముట్టడిస్తాం..
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చకపోతే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు. అంతేగాక, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ముట్టడిస్తామని విద్యార్థి జేఏసీ నేతలు హెచ్చరించారు. రాయలసీమ ప్రజలంతా హైకోర్టుతోపాటు రాజధానిని కోరుకుంటున్నారన్నారు.

మాటిచ్చి తప్పించుకోవద్దు..
ప్రజల్లోకి వెళ్లి ప్రజలతో కలిసి రోడ్డెక్కుతామని అన్నారు. రానున్న రోజుల్లో అమరావతి, ఢిల్లీ కేంద్రంగా నిరాహార దీక్షలు చేస్తామని చెప్పారు. రాయలసీమ ప్రాంతం నుంచి ఎన్నికైన 52 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డిని ఒప్పించి హైకోర్టు, రాజధానిని ఈ ప్రాంతంలో ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. తమకు మాటిచ్చిన నేతలు తప్పించుకునే ప్రయత్నాలు చేయొద్దన్నారు.

లేదంటే పోరాటం ఉధృతమే
స్వచ్చంధ సంస్థ(ఎన్జీవో)లు కూడా తమతోపాటు కలిసి వస్తాయని అన్నారు. ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి త్వరలోనే తీపి కబురు చెబుతామన్నారని.. కానీ ఎలాంటి ప్రకటనా చేయలేదని చెప్పారు. హైకోర్టుతోపాటు రాజధానిని రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటు చేయకపోతే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
ముందుగానే వేసవి సెలవులు, తాజా మార్పులు..!! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!












Click it and Unblock the Notifications