ట్రైనింగ్‌లోకి ఐపీఎస్ మహేశ్వరెడ్డి... సస్పెషన్‌ ఉత్తర్వులకు బ్రేక్ వేసిన క్యాట్

ఓ దళిత యువతిని ప్రేమ పెళ్లి చేసుకుని అనంతరం కులం పేరుతో దూషిస్తూ...మరో పెళ్లి చేసుకునేందుకు సిద్దమయ్యాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నకడప జిల్లాకు చెందిన ట్రైనీ ఐపీఎస్ మహేశ్వర్ రెడ్డిపై కేంద్ర హోంశాఖ కొరడా ఝలిపించిన విషయం తెలిసిందే.. ట్రైనింగ్‌లో మహెశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ... ఆదేశాలు జారీ చేసింది. అయితే.. హోంశాఖ నిర్ణయంపై మహేశ్వర్ రెడ్డి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌కు వెళ్లడంతో హోంశాఖ ఉత్తర్వులను అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఎత్తివేసింది. దీంతో ఆయన తిరిగి ట్రైనింగ్‌కు వెళ్లనున్నారు.

 ట్రైనీ ఐపీఎస్ మోసం చేశాడని ఆరోపణ

ట్రైనీ ఐపీఎస్ మోసం చేశాడని ఆరోపణ

కాబోయే ఐపీఎస్ ఆఫీసర్ దారి తప్పాడు. దీంతో ఆయనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. రెండు సంవత్సరాల క్రితం బావన అనే హైదారాబాద్, బోయిన్‌పల్లికి చెందిన యువతికి ప్రేమ పేరుతో దగ్గరై.... పెళ్లి కూడా చేసుకుని ఏడాదిగా కాపురం చేసి ప్లేట్ ఫిరాయిస్తున్నాడని ఆరోపిస్తూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదువుకునే క్రమంలో తాము ఒక్కటయ్యామని.. ఐపీఎస్‌కు ఎంపిక కావడంతో మాట మారుస్తున్నాడనేది ఆమె ఆరోపణ....ఈ నేపథ్యంలోనే గత రెండు నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మీడీయాతో చర్చనీయాంశం అయిన ఉదంతం

మీడీయాతో చర్చనీయాంశం అయిన ఉదంతం

అయితే ఆమె ఫిర్యాదు పై పోలీసులు సరిగా స్పందించటం లేదంటూ... మీడీయా ముందు వాపోయింది. దీంతో హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కడప జిల్లాకు చెందిన మహేశ్ రెడ్డితో భావనకు ఉస్మానియా యూనివర్సిటీలో పరిచయం ఏర్పడిందని.. ఆ క్రమంలో ప్రేమ పేరుతో దగ్గరయ్యాడని చెబుతుంది. అలా ఆమెపై ఇష్టం పెంచుకున్న మహేశ్ రెడ్డి పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేయడంతో ఏడాది కిందట మ్యారేజ్ జరిగిందని భావన చెప్పారు.

సంవత్సరం పాటు కాపురం

సంవత్సరం పాటు కాపురం

పెళ్లి తర్వాత సంవత్సర కాలం నుంచి ఇద్దరం కలిసే ఉంటున్నామని.. ఒకే దగ్గర నివసిస్తున్నట్లు కంప్లైంట్‌లో పేర్కొన్నారు. అయితే ఐపీఎస్‌గా సెలెక్ట్ కావడంతో మహేశ్ రెడ్డిలో చాలా మార్పు వచ్చిందని ఆరోపించారు. అదే క్రమంలో తానెవరో తెలియదని బుకాయిస్తున్నట్లు పోలీసులకు వివరించారు. ఇటీవల అదనపు కట్నం తీసుకొస్తే తప్ప కాపురం చేసే ప్రసక్తి లేదన్నట్లుగా మహేశ్ రెడ్డి వేధింపులకు గురి చేస్తున్నాడని.. అందుకే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చిందని చెప్పారు. దీంతో పోలీసులు కేంద్ర హోంశాఖకు సమాచారాన్ని అందించారు.

డెహ్రడూన్‌లో కూడ ఫిర్యాదు

డెహ్రడూన్‌లో కూడ ఫిర్యాదు

దీంతో ఆమె ఫిర్యాదుపై వరకట్న కేసును నమోదు చేసిన స్థానిక పోలీసులు విచారణ చేపట్టగా.... మరోవైపు మహేశ్వర్ రెడ్డి ట్రైనింగ్ తీసుకుంటున్న డెహ్రడూన్‌లో కూడ భావన సమాచారం అందించి ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ జరిపిన కేంద్రహోంశాఖ అధికారులు సస్పెండ్ చేస్తూ.. పదిరోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ట్రైనింగ్‌కు దూరంగా ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనిపై మహేశ్వర్ రెడ్డి ట్రిబ్యునల్‌‌ను ఆశ్రయించడంతో తిరిగి ట్రైనింగ్‌కు అవకాశం ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+