జగన్‌కు కేంద్రం నుంచి అన్నీ శుభవార్తలే - మరో కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అప్రూవ్..!!

కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్తను వినిపించింది. రాష్ట్రానికి చెందిన మరో బిగ్ ప్రాజెక్ట్‌ను అప్రూవ్ చేసినట్లు వెల్లడించింది. 1,700 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే ప్రాజెక్ట్ ఇది. పైగా వైఎస్ జగన్ సొంత జిల్లాకు సంబంధించినది కూడా కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉంటూ వచ్చిన రోడ్ల విస్తరణ చెందినది ఇది. ఈ ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం లభించింది.

స్వయంగా తెలిపిన నితిన్ గడ్కరీ..

స్వయంగా తెలిపిన నితిన్ గడ్కరీ..

ఈ విషయాన్ని కేంద్ర రోడ్లు, రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా వెల్లడించారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఆయన తన అధికారిక మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్‌కు ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం లభించడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమౌతోన్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్‌ను నింపినట్టయింది.

చిన్న ఓరంపాడు వరకు

చిన్న ఓరంపాడు వరకు

ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడప నుంచి అన్నమయ్య జిల్లాలోని చిన్న ఓరంపాడు వరకు జాతీయ రహదారి 716ను విస్తరించడానికి రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. సుమారు 74 కిలోమీటర్ల పొడవు ఉన్న ట్రెంచ్ ఇది. 1,732.66 కోట్ల రూపాయల వ్యయంతో కడప జంక్షన్ బైపాస్ రోడ్డు నుంచి చిన్న ఓరంపాడు వరకు జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించనున్నట్లు నితిన్ గడ్కరీ వెల్లడించారు.

షోలాపూర్-చెన్నై ఎకనమిక్ కారిడార్..

షోలాపూర్-చెన్నై ఎకనమిక్ కారిడార్..

మహారాష్ట్రలోని షోలాపూర్ నుంచి తమిళనాడు రాజధాని చెన్నైని అనుసంధానిస్తూ ఇదివరకే కేంద్ర ప్రభుత్వం ఎకనమిక్ కారిడార్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా అనుమతి ఇచ్చిన ఈ కడప-చిన్న ఓరంపాడు ట్రెంచ్ ఈ ఎకనమిక్ కారిడార్‌లో ఓ భాగం. కడప నుంచి తిరుపతి జిల్లాలోని రేణిగుంట వరకు ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారిని విస్తరించడంలో భాగంగా దీన్ని చేపట్టింది. ప్యాకేజ్ - 1 కింద దీనికి నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది.

ఈ కారిడార్ పూర్తయితే..

ఈ కారిడార్ పూర్తయితే..

ఒకసారి ఈ ఎకనమిక్ కారిడార్ పూర్తయితే.. వాహన నిర్వహణ వ్యయం భారీగా తగ్గుతుందని, రవాణా వ్యవస్థ మరింత వేగం పుంజుకుంటుందని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. సరుకుల రవాణాలో సమయాభావం తగ్గుముఖం పట్టడం వల్ల లాభాలు మరింత పెరుగుతాయని వ్యాఖ్యానించారు. ప్రయాణ సమయం, వాహన నిర్వహణ ఖర్చులు తగ్గుతాయని వివరించారు. ఆయా జిల్లాల్లో ఆర్థిక అభివృద్ధికి ఊపందుకుంటుందని, కడప-రేణిగుంట మధ్య కనెక్టివిటీ మరింత మెరుగుపడుతుందని చెప్పారాయన.

రూ.675 కోట్లతో తెలంగాణలో..

రూ.675 కోట్లతో తెలంగాణలో..

ఇదే క్రమంలో తెలంగాణకు 675 కోట్ల రూపాయలతో జాతీయ రహదారి విస్తరణను కూడా నితిన్ గడ్కరీ ప్రకటించారు. జాతీయ రహదారి -930పీలో భాగంగా మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూర్ నుంచి నెహ్రూ నగర్ వరకు ఉన్న రెండు లేన్ల రహదారిని విస్తరించనున్నట్లు చెప్పారు. హైదరాబాద్-మహబూబాబాద్- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు మావోయిస్టు ప్రాంతాలకు కలుపుతుందని వివరించారు. ప్రతిపాదిత జాతీయ రహదారి వల్ల హైదరాబాద్-భద్రాచలం మధ్య 35 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+