లిఫ్ట్ అడిగి యువతి కిరాక్ పని.. కాస్ట్లీ బైకుతో పరార్..!
కడప : లిఫ్ట్ అడిగిన ఓ యువతి కిరాక్ పని చేసింది. యువకుడిని నమ్మించి లిఫ్ట్ తీసుకుని కాస్ట్లీ బైకుతో ఉడాయించింది. కడప జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చర్చానీయాంశంగా మారింది. పోనీలే పాపం అని లిఫ్ట్ ఇస్తే ఆ యువకుడికి అసలుకే ఎసరు వచ్చింది. అయితే వారం రోజుల వ్యవధిలోనే సదరు యువతి గుట్టురట్టైంది. పోలీసులకు అడ్డంగా చిక్కి కటాకటాల పాలైంది.
ఈ నెల 17వ తేదీన శివ అనే యువకుడు తన బైక్ మీద పనుల నిమిత్తం బయలుదేరాడు. అయితే మధ్యలో కలసపాడు మండలం ఎగువ రామపురానికి చెందిన 21 సంవత్సరాల బసిరెడ్డి లీల అనే యువతి అతడిని లిఫ్ట్ కావాలంటూ సైగలు చేసింది. దాంతో అతడు బైక్ ఆపాడు. ఎక్కడికి వెళ్లాలంటూ ఆరా తీయడంతో అర్జెంటుగా రిమ్స్‌కు వెళ్లాలని.. తమ బంధువులకు అక్కడ ట్రీట్‌మెంట్ జరుగుతోందని.. దయచేసి అక్కడివరకు లిఫ్ట్ కావాలంటూ బతిమిలాడింది. ఆ క్రమంలో శివ సరే అన్నాడు. అతడి బైక్‌పై లీలను ఎక్కించుకుని రిమ్స్ వైపు బయలుదేరాడు.

అలా వెళుతున్న సమయంలో మధ్యలో శివకు ఫోన్ కాల్ వచ్చింది. దాంతో ఆయన రోడ్డు సైడుకు తన బైకును ఆపి అలా పక్కకు వెళ్లి ఫోన్ మాట్లాడుతున్నాడు. అదే అదనుగా భావించిన లీల శివ బైకుతో ఉడాయించింది. దాంతో బాధితుడు లబోదిబమన్నాడు. లక్షా 29వేల రూపాయల విలువ చేసే బైకును సదరు యువతి మాయం చేయడంతో పోలీసులను ఆశ్రయించాడు.
శివ ఫిర్యాదు మేరకు కేసు ఫైల్ చేశారు పోలీసులు. 17వ తేదీన సదరు యువతి బైక్‌తో జంప్ అయినప్పటికీ.. 21వ తేదీన కేసు ఫైల్ అయింది. అయితే కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే కేసును చేధించారు పోలీసులు. నిందితురాలి కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు ఆమె శనివారం నాడు కడపకు రాగానే అదుపులోకి తీసుకున్నారు.
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications