Karimnagar: కరీంనగర్ జిల్లాలో దారుణం.. సీఐ వేధింపులతో వ్యక్తి ఆత్మహత్య..

ఇంటెలిజెన్స్ సీఐ వేధింపులు తాళలేక ఓ వ్యక్త ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం భూపాలపట్నంలో జరిగింది. గ్రామానికి చెందిన బొడిగె శ్యామ్ అలియాస్ బొడిగె శంబయ్యకు భార్యతో పాటు కొడుకు సంజయ్, కూతురు కావ్య ఉన్నారు. కుమారుడు, కుమార్తె హైదరాబాద్ లో ఉండి చదువుకుంటున్నారు. శ్యామ్ భార్యతో కలిసి కరీంనగర్ లోని విద్యారణ్యపురిలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అతను భూములు అమ్మడం, కొనడంలో కమిషన్ తీసుకుని మధ్యవర్తిత్వం వహిస్తుంటాడు.

ఈ క్రమంలో కరీంనగర్ బ్యాంక్ కాలనీలో ఉంటున్న సెంట్రల్ ఇంటెలిజెన్స్ సీఐ కురికాల గోపికృష్ణతో భూపాలపట్నంలో కొద్ది నెలల క్రితం 20 గుంటల భూమిని రూ.50 లక్షలకు శ్యామ్ కొనిపించాడు.భూమి కొనుగోలు సమయంలో నాలుగైదు నెలల్లోనే రూ.10 లక్షలు వచ్చేలా చేస్తానని శ్యామ్ సీఐకి చెప్పాడు. అయితే 8 నెలలు గడిచినా భూమి కొనడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో సీఐ గోపి శ్యామ్ పై ఒత్తిడి తీసుకొచ్చాడు. రూ.10 లాభం వచ్చేలా చేస్తానని చెప్పావు ఎమైందంటూ ఫోన్ చేయడం మొదలు పెట్టాడు.

A man committed suicide

భూమి అమ్మడంతో పాటు రూ.10 లాభం చూపించాల్సిందేనని స్పష్టం చేశాడు. సీఐ ఒత్తిడి మరింత పెరగడంతో శ్యామ్ రూ.3 లక్షల అప్పు చేసి గోపికి చెల్లించాడు. తన బావ పేరిట భూమి కొనుగోలు చేయడానికి ఒప్పంద కూడా కుదుర్చుకున్నాడు. భూమి అమ్మకంలో జాప్యం జరగడంతో సీఐ గోపికృష్ణ శ్యామ్ ను బెదిరించడం మొదలు పెట్టాడు.

దీంతో మరో రూ.10 లక్షలు అదనంగా చెల్లిస్తానని శ్యామ్ గోపికృష్ణ ప్రామిసరీ నోట్ రాసిచ్చాడు. ఏప్రిల్ 20న సీఐ గోపీకృష్ణ శ్యామ్ ఫోన్ చేసి తిట్టడంతో పాటు బెదిరించాడు. దీంతో భయపడిపోయిన శ్యామ్ ఏప్రిల్ 21న భూపాలపట్నం వెళ్లాడు. తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

శనివారం ఉదయం ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే శ్యామ్ చనిపోయే ముందు పది పేజీల సూసైడ్ నోట్ రాశారు. ఇంటెలిజెన్స్ సీఐ గోపికృష్ణ వేధించడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో పేర్కొన్నారు.

తన టైమ్‌ బాగోలేదు.. నేనెవరికీ అన్యాయం చేయలేదని.. గోపీకృష్ణ సార్‌ వల్ల నా కుటుంబానికి కూడా ప్రాణహాని ఉంది. కావాలంటే నా ఫోన్‌లో రికార్డులు చెక్‌ చేయండి. మొత్తం విషయం బాలాజీ సార్‌కు తెలుసు అని లేఖలో రాశారు. సారీ.. సుజాతా.. నేను నీకు అన్యాయం చేస్తున్నా బిట్టు, కావ్యలను చూసుకో. ధైర్యంగా ఉండండి అంటూ ఆత్మహత్య చేసుకున్నాడు.

సీఐ గోపికృష్ణపై ఐపీసీ 306 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశామని, ఆయన పరారీలో ఉన్నాడని చొప్పదండి సీఐ రవీందర్‌ చెప్పారు. పోలీసులు శ్యామ్ కాల్ రికార్డులు పరిశీలించగా.. సీఐ శ్యామ్ బెదించినట్లు స్పష్టంగా ఉంది. నువ్వు ఆత్మహత్య చేసుకుంటే చేసుకో.. పురుగుల మందు ఇస్తా.. అంటూ సీఐ బెదరించాడు.చొప్పదండి సీఐ తన జూనియరని.. నీ బొక్కలు ఇరగ్గొడ్తడని గోపి శ్యామ్ బెదిరించినట్లు కాల్ రికార్డుల్లో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+