బీర్ల సేల్స్‌లో కరీంనగర్ టాప్.. 150 శాతం పెరిగిన విక్రయాలు.. రాష్ట్రంలో 90 శాతం హై..
తుఫాను ఎఫెక్టుతో వాతావరణం కాస్త చల్లబడింది. లేదంటే ఈ రెండు, మూడు రోజులు కూడా ఎండలు మరింత హీటెక్కించాయి. ఎండల ప్రభావంతో చలువ కోసం శీతల పానీయాల కోసం చూడటం సహజమే. అయితే మందు కొట్టేవారు.. బీర్ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు. అవును బీర్లను ఎక్కువగా తీసుకుంటారు. సమ్మర్ సీజన్‌లో హార్డ్.. అదే విస్కీ, రమ్, బ్రాండీ సేల్స్ బీర్లతో పోలిస్తే తక్కువే. లాస్ట్ ఇయర్ సమ్మర్‌లో కరోనా విలయ తాండవం చేసింది. దీంతో అప్పుడు బీర్ల సేల్స్ పెద్దగా లేకుండే.. ఈ సారి మాత్రం దసరా, న్యూ ఇయర్ మించిపోయాయి.

బీర్ల సేల్స్‌లో కరీంనగర్ టాప్..
తెలంగాణలో పండగ అంటేనే ముక్క, చుక్క.. ఇక సమ్మర్ అంటే.. ఎక్కడెక్కడి నుంచి ఊర్లకు జనం వస్తుంటారు. అలా వస్తే పండగలు, పబ్బలు జరుగుతుంటాయి. ఇంకేముంది బీర్ల కేసులు దిగడమే.. దీనికితోడు.. రోజువారీ కస్టమర్లు కూడా ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో బీర్ల సేల్స్ పెరిగాయి. గతేడాదితో పోలిస్తే ఏకంగా 90 శాతం అమ్మకాలు ఎక్కువగా జరిగాయి. అంటే పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా టాప్‌లో ఉంది. ఇక్కడ 150 శాతం ఎక్కువగా బీర్ల విక్రయాలు జరిగాయి. దీంతో కరీంనగర్ బీర్ల విక్రయాల్లో తొలి స్థానంలో నిలిచింది. అయితే హార్డ్ కన్నా బీర్లే ఎక్కువ సేల్స్ జరిగాయి.

ఖమ్మంలో ఇలా..
ఇటు ఖమ్మం జిల్లాలో కూడా బీర్ల సేల్స్ భారీగానే ఉన్నాయి. 2021-2022 ఆర్థిక సంవత్సరంలో జిల్లా 213.16 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ మేరకు ఆబ్కారీ శాఖ అధికారులు ప్రకటనలో తెలిపారు. ఇటు ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలలో గతేడాదితో పోలిస్తే 169 శాతం ఎక్కువగా బీర్ల సేల్స్ జరిగాయి. ఈ మార్చిలో 74 శాతం.. 5.22 బాటిళ్ల సేల్స్ జరిగాయి. ఏప్రిల్‌లో 94 శాతం 5.99 కోట్ల బాటిళ్ల విక్రయాలు జరిగాయి. గతేడాది మార్చిలో 3.55 కోట్లు, ఏప్రిల్ 3.14 కోట్ల బాటిళ్ల సేల్స్ జరిగాయి.

మామ.. బీర్ కొడదామా...?
నలుగురి కలిస్తే.. బీర్ కొడదామ మామా అని ముందుకు కదిలే పరిస్థితి. దాంతో బీర్ల సేల్స్ హైకి చేరుకున్నాయి. దానికితోడు ఇదివరకు బీర్లపై తెలంగాణ ప్రభుత్వం రూ.10 తగ్గించిన సంగతి తెలిసిందే. దాంతో కూడా చాలా మంది రెండు, మూడు తాగేసి.. చిల్డ్‌గా ఉంటున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. అయితే బీర్ల సేల్స్‌లో కరీంనగర్ టాప్‌లో నిలిచింది. ఇక్కడ టెంపరేచర్ ఎక్కువగా ఉండటమే కారణం.. అందు వల్ల.. భానుడి ప్రతాపం నుంచి రిలీఫ్ కావడానికి చక్కగా బీర్లు తీసుకుంటున్నారు.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications