ఏఎస్సైపై దాడి: బీజేపీ శ్రేణులేనట, టీఆర్ఎస్ ఫైర్.. మాటల యుద్దం
హుజురాబాద్ ఉప ఎన్నిక చుట్టూ రాజకీయాలు సాగుతున్నాయి. మాజీమంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఇటు నేతలు కూడా బిజీ బిజీగా ఉన్నారు. ఓటర్లను ఆకట్టుకునే పనిలో నిమగ్నం అయ్యారు. సీఎం కేసీఆర్ హుజూరాబాద్ ఉప ఎన్నికల గురించి ఫోకస్ చేస్తున్నారు. తాజాగా బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులను కూడా నియమించారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందా అనే అనుమానం కలుగుతుంది. ఓడిపోతామనే భయంతో పిచ్చిగా ప్రవర్తిస్తున్నారని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. బీజేపీ కార్యకర్తలు గుండాయిజం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఫైరయ్యారు. ఏకంగా దాడులకు పాల్పడుతూ.. భయానక వాతావరణం సృష్టిస్తున్నారు.
వీణవంక మండలం వల్లభాపూర్‌లో బీజేపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఈటల రాజేందర్ పర్యటన సందర్భంగా తన విధుల్లో భాగంగా ఫోటో తీసిన స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ బాపిరెడ్డిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తవా అంటూ ఏఎస్ఐపై దాడి చేసి ఆయన షర్ట్‌ను చింపేశారు. అంతటితో ఆగకుండా.. ఆయన బైక్ లో ఈటల అనుచరులు గాలి తీసి పైశాచిక ఆనందం పొందారు.

గత సాధారణ ఎన్నికల్లో హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఆయన రాజీనామా చేశారు. ఈటల రాజేందర్ రాజీనామాను స్పీకర్ కూడా ఆమోదించారు. దీంతో హుజురాబాద్‌లో ఎన్నికలు అనివార్యం అయ్యింది.
Recommended Video
ఇటు దళితులను ఆకట్టుకునేందుకు దళితబంధు పథకం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఎవరు గెలుస్తారు.. ప్రజలు ఎవరికీ పట్టం కడతారు?? బీజేపీ నుంచి ఈటెల రాజేందర్, టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీ చేయనున్నారు. ఉప ఎన్నికల కారణంగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపిస్తున్నారు. ఒక్కో దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేయగా.. హుజూరాబాద్ లో సభ అనంతరం ఈ ప్రాజెక్టు అమలు కోసం మొత్తం రూ. 2000 కోట్ల నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.












Click it and Unblock the Notifications