మణిహారమే.. మానేరు వాగుపై అతిపెద్ద కేబుల్ బ్రిడ్జీ, లైటింగ్‌తో జిగేల్
కరీంనగర్‌లో మానేరు డ్యాం మరింత ఆకర్షణీయంగా మారనుంది. మానేరు రివర్ డెవలప్‌మెంట్‌తో వాగును సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. దానికితోడు వాగుపై కేబుల్ బ్రిడ్జి కనువిందు చేయనుంది. ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న బ్రిడ్జీపై లోడ్ టెస్ట్ పనులు జరుగుతున్నాయి. 5 రోజులు లోడ్ టెస్ట్ పనులు కొనసాగిన తర్వాత పూర్తిస్థాయిలో దీనిని వినియోగంలోకి తేస్తారు. అప్రోచ్ రోడ్ల నిర్మాణం కూడా ప్రారంభం కానుంది.

తగ్గనున్న 7 కి.మీ
కరీంనగర్ ఎల్ఎండి వద్ద బ్రిడ్జీకి తుది మెరుగు పనులు జరుగుతుంది. జిల్లాకు తలమానికంగా నిలిచి పర్యాటక శోభను సంతరించుకోనుంది. ఇలాంటి కేబుల్ బ్రిడ్జీలు హౌరా, ముంబైలో ఉండగా.. దక్షిణ భారతంలో తొలిసారిగా ఇక్కడ నిర్మాణం అవుతుంది. సుందరంగా నిర్మాణం అవుతున్న కేబుల్ బ్రిడ్జీ... ప్రస్తుతం కరీంనగర్- వరంగల్ మధ్య ఉన్న72 కిలోమీటర్ల దూరంలో 7 కిలోమీటర్లను తగ్గించనుంది. వెయ్యి టన్నుల కెపాసిటీ ఉన్న బ్రిడ్జీ పై ఎంతటి బరువైన వాహనాలైన వెళ్ళేలా అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించారు.

పండగల వేళ డిస్ ప్లే..
ప్రత్యేక రోజుల్లో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను డిస్ ప్లే చేసేందుకు డైనమిక్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే కేబుల్ బ్రిడ్జీ పనులు పూర్తికాగా... వంతెన పై వాహనాలు ప్రయాణిస్తున్న సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండడంతో పాటు... ఫుట్ పాత్ పై ప్రజలు వెళ్ళడం వంటి విషయాలను పరిగణలోకి తీసుకుని...బ్రిడ్జీ పై లోడ్ టెస్ట్ ను ప్రారంభించారు.

రూ. 34 కోట్లు
కేబుల్ బ్రిడ్జీ అప్రోచ్ రోడ్ల నిర్మాణ పనులతో పాటు... కనెక్టివిటీ రోడ్ల పనులు పూర్తి కావల్సి ఉంది. ఇందుకోసం 34 కోట్లతో విశాలమైన రోడ్లను నిర్మిస్తారు. కరీంనగర్ కమాన్ నుంచి సదాశివపల్లి వరకు తీగెల వంతెన నిర్మాణం పోగా... మిగతా 4.7 కిలోమీటర్ల మేర పనులు జరగాల్సి ఉంది. కమాన్ నుంచి బైపాస్ రోడ్డు వరకు... సదాశివపల్లి నుంచి కేబుల్ బ్రిడ్జీ వరకు రోడ్డు పనులు చేపట్టాల్సి ఉంది. ఈ రోడ్ల పనులు పూర్తయితే... తీగల వంతెన పైకి వాహనాలు వెళ్ళేందుకు అనుమతిస్తారు.

లైటింగ్‌తో జిగేల్
సుందరంగా ముస్తాబయిన కేబుల్ బ్రిడ్జికీ... ఆధునాతనమైన లైటింగ్ మరింత శోభ తీసుకురానుంది. 8 కోట్లతో రాత్రి వెళల్లో పర్యాటకులను అలరించేలా తీగల వంతెన పై రంగు రంగుల డిజిటల్ లైటింగ్ చేసేందుకు ప్రతిపాదనలను సిద్దం చేసి ప్రభుత్వానికి పంపించారు.












Click it and Unblock the Notifications