గెల్లును గెలిపిద్దాం: కేసీఆర్‌కు కానుక ఇద్దాం, పాడి కౌశిక్ రెడ్డి
గెల్లు శ్రీనివాస్ యాదవ్ మన ఎమ్మెల్యే అని టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఇవాళ ఇళ్ళందుకుంటలో హుజూరాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు. ఈటల రాజేందర్ గెలుస్తాడని రేవంత్ రెడ్డి చేప్పినందున తాను టీఆర్ఎస్‌లో చేరానని వివరించారు. శ్రీనివాస్‌ను గెలిపించి కేసీఆర్‌కీ గిఫ్ట్ ఇవ్వాలన్నారు. కేసీఆర్ మీకు ఏం అన్యాయం చేశారు? ఏం తక్కువ చేశారు? అని ఈటల రాజేందర్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. ఈటల రాజేందర్.. మంత్రి పదవీ కాదు సీఎం కావాలని అకున్నాడని పేర్కొన్నారు.

పెద్ద ఇల్లు కట్టుకున్నాడు..
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టివ్వలే గానీ ఆయన పెద్ద ఇళ్ళు కట్టుకున్నాడని విమర్శించారు. ఇప్పుడు దళిత బంధు, గతంలో రైతు బంధు ఈ గడ్డ మీదనే ప్రారంభించినందుకు కేసీఆర్‌కు పాడి కౌశిక్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్.. కౌశిక్‌రెడ్డిని గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవికి ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అందరూ ఊహించనట్టే ఆ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఈ మేరకు బుధవారం ప్రకటించారు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించగానే గెల్లు శ్రీనివాస్ కు అభినందనలు వెల్లువెత్తాయి. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.

బీసీ నేతకు ఛాన్స్
బీసీ నేతగా ఈటల రాజేందర్ ప్రజల్లోకి వెళ్తుండడంతో ఆయనకు చెక్ పెట్టేందుకు బీసీ నేత గెల్లు శ్రీనివాస్‌ను దింపాలని టీఆర్‌ఎస్ భావించింది. ఉద్యమం సమయం నుంచే టీఆర్‌ఎస్‌వీలో క్రియాశీలకంగా పని చేస్తున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ది హుజూరాబాద్ నియోజకవర్గం. అలాగే గెల్లు శ్రీనివాస్ ఉన్నత విద్యావంతుడు కావడం విశేషం. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో గెల్లు శ్రీనివాస్ విద్యార్థి దశ నుంచే బీసీ విద్యార్థుల సమస్యలపై పోరాడారు. మంచి విద్యార్థి నేతగా గుర్తింపు పొందారు. తెలంగాణ ఉద్యమం సమయంలో టీఆర్‌ఎస్‌వి తరపున ఉద్యమానికి నాయకత్వం వహించారు.

ఓటరు మహాశయులరా..?
హుజురాబాద్ బై పోల్ వేళ సీరియస్ నెస్ ఎక్కువ అవుతుంది. ప్రధాన పార్టీల మధ్య విమర్శలు మరింత ముదురుతున్నాయి. వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రధాన రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. అందుకోసమే ఓటర్లను ఆకట్టుకునేందుకు శతవిధలా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైతే షెడ్యూల్ రాలేదు.. కానీ నియోజకవర్గంలో డబ్బు, మద్యం ఎరులై పారుతోందని విశ్వసనీయంగా తెలిసింది. ఎన్నికల్లో విజయం ఈటల రాజేందర్‌కు జీవన్మరణ సమస్య కాగా.. టీఆర్ఎస్ కూడా ప్రతిష్టత్మకంగానే తీసుకుంది. కాంగ్రెస్ కూడా అదేవిధంగా పోటీ చేయనుంది. బలమైన అభ్యర్థిని బరిలోకి దింపనుంది. బై పోల్ ఏమో కానీ.. నియోజకవర్గంలో వందల కోట్లను అభ్యర్థులు గుమ్మరించే ఛాన్స్ ఉంది. మద్యం ఏరులై పారగా.. నగదు కూడా ఎక్కువగానే ఇస్తున్నారు.

కంటిన్యూ అవుతుందా..?
మరోవైపు హుజురాబాద్ బై పోల్ నేపథ్యంలోనే దళితబంధు పథకం తెరపైకి వచ్చింది. పథకంపై విపక్షాలు గుర్రు మంటున్నాయి. దళితులు ఇప్పుడే గుర్తుకొచ్చారా అని అడుగుతున్నారు. ఎన్నికలు/ బై పోల్ నేపథ్యంలో వారు గుర్తుకు వస్తారా అని అడుగుతున్నారు. లేదంటే బడుగు బలహీన వర్గాలు గుర్తుకురారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చెప్పే అబద్దాలను ప్రజలు వినే స్థితిలో లేరని చెప్పారు. వారు అన్నీ గమనిస్తున్నారని వివరించారు. చేసిన న్యాయ, అన్యాయలను గుర్తుకు ఉంచుకుంటారని తెలిపారు. సమయం చూసి బుద్ది చెబుతారని.. బై పోల్‌లో గుణపాఠం తప్పదని అంటున్నారు. కానీ అధికార పార్టీ మాత్రం సంక్షేమ పథకాలే తమ పాలిట విజయం చేకూరుస్తాయని చెబుతున్నారు. తాము చేసిన పనులే.. విజయానికి నాంది పలుకుతాయని తెలిపారు. దళిత బంధు ఇతర పథకాలపై ప్రభుత్వం.. ఏమీ చేయడం లేదని ప్రతిపక్షాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రజలు ఏ వైపు ఉంటారో చూడాలీ మరీ. టీఆర్ఎస్ లేదా.. విపక్షాల వైపు చూస్తారో చూడాలీ మరీ. బై పోల్ చుట్టూ రాష్ట్రంలో రాజకీయాలు నడుస్తున్నాయి.

ఇవీ సందేహాలు
దళిత బంధు పథకం ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హుజురాబాద్ ఎన్నిక తర్వాత కూడా పథకం ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో దళితులు ఎక్కువగా ఉన్నందున.. పథకం తెరపైకి తీసుకొచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో నిధులు కూడా రిలీజ్ చేశారు. అయితే మిగతా ప్రాంతాల సంగతి ఏంటీ అనే ప్రశ్న వస్తోంది. బై పోల్ కోసం హుజురాబాద్‌లో కొందరినీ ఎంపిక చేసి.. ఇచ్చిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మరీ మిగతా ప్రాంతాల సంగతి ఏంటీ అనేది ఇక్కడ ప్రశ్న.. రాష్ట్రంలో గల నిరుపేద దళితులు.. దళిత బంధు పథకం కోసం ఆప్లై చేసుకోవాలా... నిజంగానే నగదు ఇస్తారా అనే సందేహాం ప్రతీ ఒక్కరిలో మెదలుతుంది. కానీ దీనికి సంబంధించి సమాధానం కావాలంటే కాలామే చెప్పాలి. ఎందుకంటే బై పోల్ జరిగే వరకు ఏ విషయంపై క్లారిటీ ఉండదు. ఎన్నిక, ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు.. ఎందుకంటే పాలకులు బడుగు, బలహీనవర్గాలను పట్టించుకోవడం అరుదుగానే ఉంటుంది. మరీ దళిత బంధు విషయంలో అలా జరుగుతుందా.. లేదో చూడాలీ
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..!












Click it and Unblock the Notifications