• search
  • Live TV
కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓ మంత్రి బావ రూ.8 కోట్ల ప్రాపర్టీ అక్రమించారు: గోనె ప్రకాశ్ రావు సంచలనం

|
Google Oneindia TeluguNews

గోనె ప్రకాశ్ రావు చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. ఎమ్మెల్యేల అక్రమాల గురించి మాట్లాడారు. మంత్రి బావ అంటూ హాట్ కామెంట్స్ చేశారు. సీఎం కేసీఆర్, అలాగే మావోయిస్టుల గురించి కూడా మాట్లాడారు. ఇప్పుడు ఆ భయం లేదని పేర్కొన్నారు. నేతలు అంతా అక్రమంగా డబ్బు సంపాదించడంపై ఫోకస్ చేశారని తెలిపారు.

నక్సల్స్ బలం సీఎం కేసీఆర్‌కు తెలుసని గోనె ప్రకాష్ రావు హాట్ కామెంట్స్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో నక్సల్స్ లేఖలు రాశారని తెలిపారు.ఇప్పుడు ఆ ప్రభావం తగ్గిందన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నక్సల్స్ బలహీన పడ్డారని పేర్కొన్నారు.

gone prakash rao made sensational comments on mla and minister brother in law

కోల్ బెల్ట్ ప్రాంతం రామగుండం, చెన్నూరు, బెల్లంపల్లి ఎమ్మెల్యేలకు మావోయిస్టుల హెచ్చరికలు వచ్చాయని గుర్తుచేశారు. మెడికల్, ఉద్యోగాల మాఫియాపై మావోయిస్టులు సీరియస్‌గా ఉన్నారని వివరించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి బావ రూ.8 కోట్ల ప్రాపర్టీని ఆక్రమించారని సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు ఎమ్మెల్యేల అరాచకాలు చూస్తే తనకే చంపాలని అనిపిస్తోందని మండిపడ్డారు.

ఎమ్మెల్యేల అక్రమాలను సంబంధించిన వివరాలను సేకరిస్తున్నానని కామెంట్ చేశారు. ఆ ఆధారాలకు సీఎం కేసీఆర్‌కు పంపిస్తానని బాంబ్ పేల్చారు. గోనె ప్రకాశ్ రావు కామెంట్స్ కలకలం రేపాయి. ఆయన సీనియర్ కాంగ్రెస్ నేత.. ఆర్టీసీ మాజీ చైర్మన్‌గా కూడా పనిచేశారు.

English summary
gone prakash rao made sensational comments on mla and minister brother in law
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X