గెలిస్తే మంత్రి, ఓడితే ఎమ్మెల్సీ.. హుజురాబాద్ బై పోల్ బరిలో ఎల్ రమణ..?
హుజురాబాద్ బై పోల్ హీట్ పుట్టిస్తోంది. బీజేపీ- టీఆర్ఎస్ మధ్య పోటీ ఉండనుంది. కాంగ్రెస్ కూడా అభ్యర్థి వేటలో ఉంది. టీజేఎస్ కూడా పోటీ చేస్తామని ప్రకటించింది. దీంతో ఉప ఎన్నిక కాస్త టఫ్‌గా ఉండే ఛాన్స్ ఉంది. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ బరిలోకి దిగడం ఖాయం. అధికార పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థిపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. కానీ చివరగా.. ఎల్ రమణ పేరు తెరపైకి వచ్చింది. ఆయన ఇటీవల సీఎం కేసీఆర్‌ను కలిసిన సంగతి తెలిసిందే. గులాబీ తీర్థం పుచ్చుకుంటానని కూడా చెప్పారు.

ఈటల వర్సెస్ రమణ
ఈటల రాజేందర్ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినవారు. బీసీ.. హుజురాబాద్‌లో దళితులు, బీసీల ఓటు బ్యాంకు ఎక్కువ.. దీంతో టీఆర్ఎస్ పార్టీ సామాజిక సమీకరణాలు, విజయవాకాశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. అన్నీ విధాలా ఆలోచించి.. ముందుడుగు వేయబోతోంది. ఎల్ రమణ అయితే బాగుంటుందని అభిప్రాయ పడింది. ఆ తర్వాత ఆయనను ఆహ్వానించడం, పోటీ చేయిస్తామని ఇండికేషన్స్ ఇచ్చింది. ఎల్ రమణ పద్మశాలీ.. హుజురాబాద్‌లో బీసీలే ఎక్కువగా ఉండటంతో ఓటు బ్యాంకు మళ్లించుకోవచ్చని గులాబీ దళపతి ఆలోచన.

మంత్రి పదవీ ఆఫర్
అంతేకాదు హుజురాబాద్‌లో పోటీ చేస్తే రమణకు మంచి ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. ఆయన పోటీ చేసి గెలిస్తే.. మంత్రివర్గంలోకి తీసుకుంటామని భరోసా ఇచ్చినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఈటల రాజేందర్‌ను ఓడించడానికి టీఆర్ఎస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతుంది అనడానికి ఇంతకంటే మరో నిదర్శనం లేదు. ఒకవేళ ఆయన పోటీ చేసి కూడా ఓడిపోతే పార్టీలో సముచితంగా గౌరవం ఇస్తామని హామీ ఇచ్చారని సమాచారం. ఎమ్మెల్సీ పదవీ ఇస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారని విశ్వసనీయంగా తెలిసిందే. అందుకే రెండు, మూడు రోజుల్లో రమణ గులాబీ దళంలోకి చేరేందుకు అంగీకరించారని పొలిటికల్ సర్కిళ్లలో టాక్ వినిపిస్తోంది.

ఓడించాలని కంకణం..
హుజురాబాద్ సీటు దక్కించుకోవడం టీఆర్ఎస్ పార్టీకి ప్రతిష్టాత్మకం.. ఈటల రాజేందర్‌ను ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకున్నారు. అందుకోసమే రమణను పార్టీలోకి ఆహ్వానించి మరీ.. పోటీ చేయించబోతున్నారు. పోటీ చేసి గెలిచినా పదవే, ఓడినా పదవీ ఇస్తామని చెప్పారని సమాచారం. రమణ కూడా గట్టిగా ట్రై చేసి.. మంత్రివర్గంలోకి వచ్చేందుకు తగిన ప్రణాళిక వేసుకున్నారని తెలుస్తోంది. అందుకోసమే.. తాను ఇన్నాళ్లు ఉన్నా పార్టీని కాదని, టీఆర్ఎస్‌లో చేరతానని చెప్పారని సమాచారం.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications