BJP అమ్మకాల పార్టీ, TRS నమ్మకాల పార్టీ.. ఏదీ కావాలో తేల్చుకొండి: హరీశ్ రావు
హుజురాబాద్ బై పోల క్యాంపెయిన్ హీటెక్కింది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో అరాచకానికి, అభివృద్ధికి మధ్య పోటీ జరుగుతోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలపై సంపూర్ణ విశ్వాసం ఉందని వివరించారు. మెజార్టీతో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేదింటి బిడ్డ అని, పేద మహిళలు ఆసరా పింఛన్ డబ్బులు కూడా ఆయనకు ఎన్నికల ఖర్చుల కింద ఇస్తున్నారని తెలిపారు.
హుజూరాబాద్ ముందు నుంచే టీఆర్‌ఎస్ పార్టీకి కంచుకోట లాంటిదని హరీశ్ రావు వివరించారు. 2001లో రైతు నాగలి గుర్తుతో ఈ ప్రాంత ప్రజలు గెలిపించారని గుర్తుచేశారు. బీజేపీ అమ్మకాల పార్టీ అని, టీఆర్‌ఎస్ పార్టీ నమ్మకాల పార్టీ అని తెలిపారు. అమ్మకాలకు, నమ్మకాలకు మధ్య పోటీ జరుగుతోందని తనదైన శైలిలో కామెంట్ చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గం వ్యవసాయ ఆధారిత ప్రాంతమని.. 60-70 వేల మంది రైతులు ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తారా, ఎందుకు ఓటు వేయాలో చెప్పని బీజేపీకి వేస్తారా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు.

హుజూరాబాద్ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్ మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల చేశారు. అక్టోబర్ 8వరకు నామినేషన్ దాఖలుకు చివరి తేదీగా నిర్ణయించారు. అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13గా ప్రకటించారు. అక్టోబర్ 30వ తేదీన ఎన్నికల నిర్వహిస్తారు. నవంబర్ 2వ తేదీ ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను ప్రకటిస్తారు.
హుజురాబాద్‌లో విజయం టీఆర్ఎస్- బీజేపీకి తప్పనిసరి. గెలుపు కోసం ఆ రెండు పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అధికార పార్టీకి విజయం కంపల్సరీ.. లేదంటే మొహం చూపించుకునే పరిస్థితి ఉండదు. ఇక బీజేపీ పరిస్థితి అయితే మరీ దారుణం.. పార్టీకి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ.. అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మాత్రం జీవన్మరణ సమస్యే.. ఎందుకంటే ఆయన ఓడిపోతే రాజకీయంగా కోలుకోలేని దెబ్బ.. ఇక రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరీ హుజురాబాద్ ప్రజలు ఏం తీర్పు చెప్పనున్నారో చూడాల్సిందే.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications