ఇదీ చిన్నప్పటి ఫోటో.. నాలుగో తరగతిలో దిగాం, పిక్ షేర్ చేసిన కేటీఆర్
కేటీఆర్.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. సాయం చేయాలని కోరితే వెంటనే స్పందిస్తారు. సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. కష్టం వచ్చిందిని చెబితే తన టీమ్‌ను పంపించి.. తగిన సాయం అందిస్తారు. సోషల్ మీడియాలో సేవా కార్యక్రమాల గురించే కాక.. అప్పుడప్పుడు తన పర్సనల్ లైఫ్‌ను కూడా కేటీఆర్ పంచుకుంటారు.
మెమోరబుల్ మూమెంట్స్‌ను అప్పుడప్పుడు కేటీఆర్ షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా కేటీఆర్ ఓ ఫోటోను తన ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. అది తన చిన్ననాటి ఫోటో. తన చిన్నప్పుడు నాలుగో తరగతి చదివే సమయంలో తన క్లాస్ మెట్స్‌తో కలిసి దిగిన ఫోటో అది. నాలుగో తరగతి చదివే సమయంలో టీచర్స్‌తో కలిసి వాళ్లంతా కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు.

1984వ సంవత్సరం నాటి ఫోటో అది అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. భరత్ అనే న క్లాస్ మేట్ నాకు ఫోటోను పంపించాడని తెలిపారు. కరీంనగర్‌లోని సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్‌లో 4 వ తరగతి చదువుతున్న సమయంలో దిగిన ఫోటో అని.. ఆ ఫోటోలో ఉన్నవాళ్లందరి పేర్లు తనకు ఇప్పటికీ గుర్తున్నాయి అపి ఆ పిక్‌ను షేర్ చేశారు.
కేటీఆర్ ఆ ఫోటోను షేర్ చేశారో లేదో.. ఆ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ ఫోటోలో మీరు ఎక్కడున్నారు కేటీఆర్.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే.. ఆ ఫోటోలో కేటీఆర్ ఎక్కడున్నారో మాత్రం చెప్పలేదు.












Click it and Unblock the Notifications