ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి భార్య, తల్లికి కరోనా.. హై టెన్షన్
తెలంగాణలో ఒమిక్రాన్ హైటెన్షన్ కలిగిస్తోంది. ఇప్పటివరకు 38 కేసులు వచ్చాయి. అయితే మొన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక కేసు వచ్చిన సంగతి తెలిసిందే. అతని ప్రైమరీ సెకండరీ కాంటాక్టులకు సెకండ్ చేశారు. అతని భార్య, తల్లికి కరోనా సోకింది. దీంతో వారి శాంపిల్స్ కూడా జినొమ్‌కు పంపిస్తారు. అక్కడ పరీక్ష ఫలితంతో ఒమిక్రానా కాదా అనే అంశం తెలియనుంది.
ఇటు హైదరాబాద్‌లో ఒకరికి ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చింది. కెన్యా నుంచి హైదరాబాద్ వచ్చిన వ్యక్తికి ఒమైక్రాన్ వైరస్ సోకింది. హయత్‌నగర్‌లో ఉన్న అతడిని వైద్యులు టిమ్స్‌కు తరలించారు. బాధితుడి కాంటాక్ట్‌ను గుర్తించి వైద్యులు టెస్టులు చేస్తున్నారు. దేశంలో 213 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. మహారాష్ట్రలో అత్యధిక ఒమిక్రాన్ కేసులు ఉండగా ఆ తర్వాత ఢిల్లీలో కేసుల సంఖ్య అధికంగా ఉంది. ఒమిక్రాన్ కేసుల్లో తెలంగాణ మూడవ స్థానంలో ఉంది.

ఇటు టిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైరస్ బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించామని నిన్న తెలిపారు. మిగతా వారిలో స్వల్ప లక్షణాలే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న క్రమంలో అప్రమత్తమైన ప్రభుత్వం.. ఒమిక్రాన్‌ను గుర్తించే జీనోమ్ సీక్వెన్సింగ్‌ను ఏర్పాటు చేస్తుంది. గాంధీ ఆసుపత్రిలో ఒమిక్రాన్ జీనోమ్ సీక్వెన్సింగ్ అందుబాటులోకి వస్తే రోజుకు 48 శాంపిళ్లను పరీక్షించే అవకాశం ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో చాపకింద నీరులా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒక్కోరోజు 10 కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది. క్రిస్మస్, న్యూ ఇయర్ ఆంక్షలు పెడితే ఎలా ఉంటుందనే అంశం గురించి డిస్కష్ చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ డిసిషన్ తీసుకుంది. తెలుగు రాష్ట్రాలు ఉలుకు లేదు పలుకు లేదు.
80 శాతం కేసుల్లో అసలు లక్షణాలే లేవని వైద్యారోగ్యశాఖ మంత్రి మాన్సుక్ మాండవీయ తెలిపారు. మరో 13 శాతం కేసుల్లో స్వల్ప లక్షణాలే ఉన్నట్టు చెప్పారు. దక్షిణాఫ్రికాలో తొలుత వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటి వరకు 100 దేశాలకు వ్యాప్తి చెందింది. యూరప్‌లో కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. అమెరికాలో సైతం ఈ రకం కేసులు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. అక్కడ ఒకరు చనిపోయారు కూడా.












Click it and Unblock the Notifications