తలపై టెంకాయ: దుడ్డు కర్రతో రెండుగా చేసిన పుజారి.. నోరెళ్లబెట్టిన స్థానికులు..
అప్పుడప్పుడు విచిత్రాలు జరుగుతుంటాయి. వింత ఘటనలు చోటుచేసుకుంటాయి. వినడానికి విచిత్రంగా ఉన్నా.. ఇవీ మాత్రం నిజం.. కరీంనగర్ జిల్లాలో ఓ పుజారి ఏకంగా తలపై ఉన్న టెంకాయ పగులగొట్టారు. ఇదీ చూసిన జనం నోరెళ్లబెట్టారు. వాయిద్య చప్పుళ్ల మధ్య మంత్రాలు చదువుతుండగా పూజారులు నృత్యం కూడా చేశారు. అదే హోష్‌లో కొబ్బరికాయలను వరసగా పగులగొట్టుకుంటూ వచ్చారు.
దేవుడికి సమర్పించే పూర్ణఫలం టెంకాయ. పూజ తర్వాత టెంకాయ కొట్టడం సంప్రదాయం. కొబ్బరికాయను ఖచ్చితంగా సగానికి పగలగొట్టడం అందరి వల్ల కాదు. నిత్యం పూజలు చేసేవారికి మాత్రమే ఈజీ అవుతోంది. కరీంనగర్ జిల్లా సైదాపూర్‌లో మాత్రం తలపై ఉన్న కొబ్బరికాయను ఏకంగా రెండు ముక్కలు చేశారు. దీంతో అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు.

సైదాపూర్‌కు చెందిన వీరన్న ఇంట్లో పూజ చేశారు.ఇంటి పెద్దల తలపై.. కుటుంబసభ్యుల చేతుల్లో పూజారులు టెంకాయలు పెట్టారు. వాయిద్య చప్పుళ్ల మోగడంతో కుటుంబ సభ్యుల చేతుల్లో ఉన్న కొబ్బరికాయలను పుజారులు దుడ్డు కర్రతో పగలగొట్టారు. కుటుంబ పెద్దల తలపై ఉన్న టెంకాయలను కూడా పగలగొట్టారు. అది కూడా ఒకే దెబ్బకు రెండుగా పగుల కొట్టారు. దీంతో స్థానికులంతా ఆశ్చర్యపోయారు.












Click it and Unblock the Notifications