పీక్‌కి చేరిన భూతవైద్యం: బాలింతను లాగికొట్టడంతో తలకు తీవ్రగాయం, ఆస్పత్రిలో మృతి..(వీడియో)
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అభివృద్ది చెంది.. నింగిలోకి రాకెట్లను పంపిస్తోన్న క్రమంలో.. మూఢ నమ్మకాలను వీడటం లేదు. అవును మారుమూల ప్రాంతాల్లోనే కాదు.. పట్టణాలకు కూతవేటు దూరంలో కూడా భూతవైద్యాలు జరుగుతున్నాయి. అయితే ఇటీవల కరీంనగర్ జిల్లాలో ఓ బాలింతను భూత వైద్యుడు కొట్టడంతో.. తీవ్ర గాయాలై చనిపోయింది. దీంతో మరోసారి మూఢ నమ్మకాలు, భూత వైద్యం చర్చకు దారితీసింది. అయితే సదరు భూతవైద్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నాస్తిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ప్రేమించి.. పెళ్లి, బిడ్డ...
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాకకు చెందిన రజిత.. మంచిర్యాల జిల్లా కుందారానికి చెందిన మల్లేష్ ప్రేమించింది. అయితే రజితకు పేరంట్స్ లేకపోవడంతో అభ్యంతరం రాలేదు. దీంతో వారిద్దరూ పెళ్లి చేసుకోగా.. నెలల క్రితం ఆమెకు పాప జన్మించింది. అయితే ఆమె ఆరోగ్యంగా ఉండటం లేదు. దీంతో ఇరుగు పొరుగువారి సూచనల మేరకు భూతవైద్యుడి వద్దకు తీసుకొచ్చారు.
Recommended Video

భూత వైద్యుడు శ్యామ్..
స్థానికంగా ఉండే దొగ్గల శ్యామ్ అనే భూత వైద్యుడి వద్దకు రజితను నాలుగురోజుల క్రితం తీసుకొచ్చారు. ఇక మన భూత వైద్యుడు.. తెలిసీ, తెలియని ప్రతాపం చూపించాడు. ఆ వీడియో కూడా ఉండటంతో అతని భూత వైద్యం ఏంటో ప్రపంచానికి తెలిసింది. చెంపపై కొట్టగా.. అప్పటికే ఆమె భయపడిపోయింది. చివరకు లాగి కొట్టడంతో మంచంపై పడేయడంతో తలకు తీవ్ర గాయమయ్యింది. తర్వాత వారు కరీంనగర్‌లోని ప్రతిమ ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో ఆమెకు వైద్యులు ట్రీట్‌మెంట్ ఇచ్చారు. కానీ గాయాలతో బాలింత మృతిచెందింది. భౌతికదేహాన్ని గద్దపాక తీసుకెళ్లి అంత్యక్రియలు కూడా నిర్వహించారు.
ఇద్దరి అరెస్ట్...
బాలింత రజితపై దాడి చేసిన భూతవైద్యుడు శ్యామ్, అతడికి సహకరించిన బాబాయ్ రవీందర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అత్తగారిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. కానీ రజిత మృతి మాత్రం స్థానికంగా కలకలం రేపింది. ఆమె బంధువులు భూత వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటు నాస్తిక సంఘాలు కూడా భూతవైద్యం చేసేవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications