కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

1200 ఎకరాల భూమి.. రూ.600 కోట్ల విలువ, వామనరావు వాట్సాప్ పోస్టులు.. పిటిషన్ వేసేలోపు మర్డర్

|
Google Oneindia TeluguNews

వామనరావు దంపతుల హత్య కేసుతో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. వామనరావు- కుంట శ్రీను మధ్య గుడి వివాదం నడుస్తోంది. క్వారీతో పుట్ట మధు వందల కోట్లు సంపాదిస్తున్నారని వామనరావు పిటిషన్లు వేశారు. దీంతో పుట్టమధు- వామనరావు మధ్య వివాదం నడుస్తోంది. అయితే మరో కొత్త విషయం కూడా వెలుగుచూసింది. వందల ఎకరాల భూమి వివాదం తెలిసింది.

 నేను ఉన్నాను.. ఎక్కడికీ వెళ్లలేదు.. వామనరావు మర్టర్ కేసుపై పుట్ట మధు నేను ఉన్నాను.. ఎక్కడికీ వెళ్లలేదు.. వామనరావు మర్టర్ కేసుపై పుట్ట మధు

1200 ఎకరాలు..

1200 ఎకరాలు..

మంచిర్యాల జిల్లాలో భూముల అన్యాక్రాంతం విషయం బయటపడింది. నెన్నెల మండలంలో 1200 ఎకరాల భూమి చేతుల మారిందని వామనరావు చెబుతున్నారు. దీని విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.600 కోట్లు ఉంటుంది. ఇదే విషయాన్ని వామనరావు వాట్సాప్‌లో పోస్ట్ చేశారు. అదీ తెగ వైరలయ్యింది. ఇలా బయటకు రావడంతో.. ప్రత్యర్థులు వామనరావును మట్టుబెట్టేశారు. వామనరావు చనిపోయిన తర్వాత వాట్సాప్ స్కీన్ షాట్స్ కూడా వైరల్ అవుతున్నాయి.

పిటిషన్లతో పగ

పిటిషన్లతో పగ


రాజకీయ, పోలీసు, ప్రభుత్వ అధికారుల తీరుపై పలు అంశాల్లో వామనరావు హైకోర్టులో పిటిషన్‌ ఫైల్‌ చేశారు. దీంతో ప్రత్యర్థి వర్గంతో శత్రుత్వం ఏర్పడింది. 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పటి మంథని ఎమ్మెల్యే పుట్ట మధు రూ. 900 కోట్లు ఇసుక క్వారీలతో అక్రమంగా సంపాదించాడని హైకోర్టులో పిటిషన్‌ ఫైల్‌ చేశారు. పుట్ట మధు పోటీ చేయకుండా ప్రయత్నించిన తీరు అప్పట్లో వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం శ్రీధర్‌బాబుకు అనుకూలంగా వ్యవహరించారనే పుట్ట మధు వర్గీయులు ఆరోపణలు చేశారు.

పోలీసులపై కూడా

పోలీసులపై కూడా

వన్యప్రాణి వేట కేసులో మంథని పోలీస్‌స్టేషన్‌లో ఆత్మహత్య చేసుకున్న నిందితుడి ఘటనలో సైతం పోలీసులే కొట్టి చంపారని కోర్టులో పిటిషన్‌ ఫైల్‌ చేశారు. ఇదీ కూడా వివాదాస్పదమైంది. పలు రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారుల విషయాల్లో వామనరావు తలదూర్చారని ప్రచారం ఉంది. ఆ క్రమంలోనే ప్రత్యర్థులు ఒక్కటై మట్టుబెట్టారని తెలుస్తోంది.

English summary
advocate vaman rao post 1200 acre land issue in whatsapp then couple murdered.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X