టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై షర్మిల సంచలన వ్యాఖ్యలు..!!
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పైన వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల కీలక వ్యాఖ్యలు చేసారు.
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పైన వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల కీలక వ్యాఖ్యలు చేసారు. రేవంత్ రెడ్డి తన యాత్రలో వైఎస్సార్ పేరు ప్రస్తావించటం పైన షర్మిల ఫైర్ అయ్యారు. వైఎస్సార్ పాలన తీసుకొస్తానంటూ రేవంత్ జపం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ ను టార్గెట్ చేస్తూ షర్మిల వరుస ట్వీట్లు చేసారు. రేవంత్ పదే పదే వైఎస్సార్ పేరు ప్రస్తావిస్తే అభిమానులే బుద్ద చెబుతారని హెచ్చరించారు. రేవంత్ ఊరూరూ తిరిగి పొర్లు దండాలు పెట్టిన జనం నమ్మరని షర్మిల పేర్కొన్నారు.
ఓటుకు నోటు దొంగను జనాలు నమ్మడం లేదని, మహానేత పేరును వాడకుంటున్న రేవంత్ కు YSR అభిమానులే బుద్ధి చెప్తారు. YSR సంక్షేమ పాలన కోసం పుట్టిన ఏకైక పార్టీ YSR తెలంగాణ పార్టీ. ఆ మహానేత ఆశయ సాధన కోసం 3800 కి.మీ. పాదయాత్ర చేసి, ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేసింది YSR బిడ్డ మాత్రమే.
— YS Sharmila (@realyssharmila) March 6, 2023
3/3
రేవంత్ లక్ష్యంగా ట్వీట్లు చేసిన షర్మిల తన తండ్రి వైఎస్సార్ పేరుతో ప్రచారం చేయటం పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ మేరకు షర్మిల తన ట్వీట్లలో..'మహానేత YSR పాలన తెస్తా' అంటూ ఓటుకు నోటు దొంగ కొత్త జపం చేయడం హాస్యాస్పదం.చంద్రబాబు విసిరిన ఎంగిలి మెతుకుల కోసం ఆనాడు YSRను ఆజన్మ శత్రువు అన్నది ఈ దొంగ కాదా? మహానేత మరణిస్తే పావురాలగుట్టలో పావురం అంటూ హేళన చేసింది ఈ దగా కోరు కాదా? ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రేవంత్ కు YSR గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు.పులి తోలు కప్పుకున్నంత మాత్రానా నక్క పులి కాదు. అద్దెకు తెచ్చుకున్న ఉద్దెర లీడర్ రేవంత్ రెడ్డి. కారులో తిరుగుతూ ఆట విడుపులా పాదయాత్ర చేస్తూ పాదయాత్ర అనే పదాన్ని అపహాస్యం చేస్తున్నాడు. ఇలాంటి ప్రబుద్ధుడు ఊరూరా తిరిగి పొర్లు దండాలు పెట్టినా జనం నమ్మరు..అని పేర్కొన్నారు.

దీనికి కొనసాగింపుగా చేసిన ట్వీట్ లో ఓటుకు నోటు దొంగను జనాలు నమ్మడం లేదని, మహానేత పేరును వాడకుంటున్న రేవంత్ కు YSR అభిమానులే బుద్ధి చెప్తారు. YSR సంక్షేమ పాలన కోసం పుట్టిన ఏకైక పార్టీ YSR తెలంగాణ పార్టీ. ఆ మహానేత ఆశయ సాధన కోసం 3800 కి.మీ. పాదయాత్ర చేసి, ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేసింది YSR బిడ్డ మాత్రమే...అని చెప్పుకొచ్చారు.
మాట్లాడే నైతిక హక్కు లేదు.పులి తోలు కప్పుకున్నంత మాత్రానా నక్క పులి కాదు. అద్దెకు తెచ్చుకున్న ఉద్దెర లీడర్ రేవంత్ రెడ్డి. కారులో తిరుగుతూ ఆట విడుపులా పాదయాత్ర చేస్తూ పాదయాత్ర అనే పదాన్ని అపహాస్యం చేస్తున్నాడు. ఇలాంటి ప్రబుద్ధుడు ఊరూరా తిరిగి పొర్లు దండాలు పెట్టినా జనం నమ్మరు.
— YS Sharmila (@realyssharmila) March 6, 2023
2/3
కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా వైఎస్సార్ హయాంలో అమలు చేసిన పాలన గురించి రేవంత్ తన పాదయాత్రలో వివరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ప్రజా సంక్షేమం అమలు జరిగిందని చెబుతున్నారు. తన తండ్రి వైఎస్సార్ పేరును ప్రస్తావిస్తూ రేవంత్ ప్రచారం చేయటం పైన షర్మిల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు దీని పైన రేవంత్ ఏవిధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.
‘మహానేత YSR పాలన తెస్తా’ అంటూ ఓటుకు నోటు దొంగ కొత్త జపం చేయడం హాస్యాస్పదం.చంద్రబాబు విసిరిన ఎంగిలి మెతుకుల కోసం ఆనాడు YSRను ఆజన్మ శత్రువు అన్నది ఈ దొంగ కాదా? మహానేత మరణిస్తే పావురాలగుట్టలో పావురం అంటూ హేళన చేసింది ఈ దగా కోరు కాదా? ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రేవంత్ కు YSR గురించి
— YS Sharmila (@realyssharmila) March 6, 2023
1/3












Click it and Unblock the Notifications