Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హెచ్ఎం ఘాతుకంం పోర్న్ వీడియోలు చూపించి పాఠశాల పిల్లలపై లైంగిక దాడి: గర్భం దాల్చిన బాలిక

ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఓ పాఠశాలలో దారుణం జరిగింది. ఐదుగురు విద్యార్థులపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడ్ని అరెస్ట్ చేశారు.

ప్రధానోపాధ్యాయుడి ఘాతుకం

ప్రధానోపాధ్యాయుడి ఘాతుకం

కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం 50 శాతం హాజరుతో పాఠశాలలను నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కొత్తగూడెంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో ఓ ప్రధానోపాధ్యాయుడు, మరో టీచర్ రోజు తప్పించి రోజు తరగతులు చెబుతున్నారు. కాగా, 40 ఏళ్ల ప్రధానోపాధ్యాయుడు పాఠశాలలకు వచ్చే బాలికలను లైంగిక వేధించాడు.

పోర్న్ వీడియోలు చూపించి లైంగిక దాడి..

పోర్న్ వీడియోలు చూపించి లైంగిక దాడి..

పోర్నోగ్రాఫిక్ వీడియోలను బాలికలకు చూపించి బలవంతంగా వారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ప్రధానోపాధ్యాయుడు. నిందితుడు సుమారు ఐదుగురు బాలికలపై పలుమార్లు లైంగిక దాడి చేసినట్లు తేలింది. దీంతో 7-11ఏళ్ల వయస్సు మధ్య ఉన్న బాధిత బాలికలు ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. ఓ బాలిక గర్భం దాల్చింది.

విద్యార్థినులకు హెచ్ఎం బెదిరింపులు

విద్యార్థినులకు హెచ్ఎం బెదిరింపులు

ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని బాధిత బాలికలను ప్రధానోపాధ్యాయుడు హెచ్చరించడంతో వారు భయంతో ఎవరికీ చెప్పలేదు. కాగా, బాధిత బాలికలకు వైద్య పరీక్షలు చేయడంతో ఈ మేరకు విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాధిత బాలికల తల్లిదండ్రులు, పోలీసులు ఆరా తీయగా ప్రధానోపాధ్యాయుడి ఘాతుకాలు ఒక్కటొక్కటిగా బయటపడ్డాయి.

Recommended Video

    Telangana Floods: Bhadrachalam Godavari Crosses Third Danger Warning | Oneindia Telugu
    నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు

    నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు

    ఈ క్రమంలో నిందిత ప్రధానోపాధ్యాయుడిపై అత్యాచారం, పోస్కో, పిల్లలపై లైంగిక వేధింపుల వ్యతిరేక చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధిత పిల్లలు చిన్న వయస్కులు కావడంతో వారిలో ధైర్యం నింపేందుకు కౌన్సిలర్లు, ఐసీడీఎస్ సిబ్బందితో పనిచేస్తున్నామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ తెలిపారు. ట్రైబల్ ఏరియాలోని చిన్న పాఠశాలలో ఈ దారుణం జరిగిందని చెప్పారు. కాగా, నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధిత బాలికల తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+