వావ్.. సర్కార్ దవాఖానలో అడిషనల్ కలెక్టర్ డెలివరీ.. నెటిజన్ల ప్రశంసలు
సర్కార్ ఆసుపత్రి అంటేనే చిన్నచూపు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాస్త పరిస్థితి మారింది. అంతకుముందు అద్వాన్నంగా సిచుయేషన్ ఉండేది. అందుకే నేతలు/ అధికారులు కూడా సర్కార్ దవాఖానకు వెళుతుంటారు. దీంతో చాలామందికి అవగాహన కలుగుతుంది. అయితే అడిషనల్ కలెక్టర్.. సర్కార్ దవాఖానలో డెలివరీ చేసుకుంది.
అంతకుముందు ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యలు ఉండవని అపోహ ఉండేది. వైద్యులు సరిగా పని చేయరని ప్రజల్లో ఒక అప నమ్మకం ఏర్పడింది. దీంతో కార్పొరేట్ ఆస్పత్రుల హవా పెరిగిపోయింది. ప్రభుత్వాసుపత్రిలో డెలివరీ చేయించుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్. ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్‌గా పని చేస్తున్న స్నేహలత 9 నెలల గర్భిణి.. ఆమెకు నిన్న పురిటి నొప్పులు రావటంతో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి సామాన్య మహిళగా వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు.

పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆమెకు ఆపరేషన్ చేయాలని సూచించారు. అందుకు ఆమె అంగీకరించటంతో వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేసి డెలివరీ చేశారు. అడిషనల్ కలెక్టర్ ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావటంతో ప్రతి ఒక్కరూ స్నేహలతను అభినందిస్తున్నారు. సర్కారు దవాఖానాలో డెలివరీ చేయించుకుని, అందరికీ ఆదర్శంగా నిలిచారని అంటున్నారు. దీంతో ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెరుగుతుందని అభినందిస్తున్నారు.
నిజమే మరీ.. డబ్బులు ఉన్నవారు ఎలా ప్రైవేట్ దవాఖానలో చూయించుకుంటారు. మరీ లేనివారి సంగతి ఏంటీ.. వారు ఎలా ఉండాలి..? ఏ విధంగా చూయించుకోవాలి.. ఎలా నెట్టుకురావాలనే అంశం మింగుడుపడని విషయమే. పరిస్థితి మారుతున్న వేళ.. అడిషనల్ కలెక్టర్ చేసిన పని అందరికీ ఆదర్శంగా నిలవనుంది. మిగతా జనం సర్కార్ దవాఖాన వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications