భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కన్నుమూత... మూడుసార్లు ఎమ్మెల్యే.. అయినా సొంత ఇల్లు లేని నేత..

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి(95) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం(ఏప్రిల్ 12) తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సీపీఎం నాయకులు,ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు.

కొంతకాలంగా కుంజా బొజ్జి శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో చికిత్స నిమిత్తం బంధువులు ఆయన్ను హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ కొద్దిరోజుల చికిత్స అనంతరం తిరిగి భద్రాచలం తీసుకొచ్చారు. కొద్దిరోజులకే ఆయన ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. దీంతో భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడే చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు.

bhadrachalam ex cpm mla kunja bojji passed away

కుంజా బొజ్జి భద్రాచలం నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1985,1989,1994 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా వరుసగా మూడుసార్లు గెలుపొందారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ ఆయన అత్యంత నిరాడంబర జీవితాన్నే గడిపారు. ఇప్పటికీ ఆయన సొంత ఇల్లు కూడా లేదని చెబుతుంటారు. చివరి రోజుల్లో కుమార్తెల ఇళ్ల వద్దే ఆయన కాలం వెళ్లదీసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా తనకు వచ్చే ఫించన్ డబ్బులతోనే ఆయన జీవనం సాగించారు.

సీపీఎం పార్టీ తరుపున ఎన్నో కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. ఏజెన్సీ ప్రజలకు,గిరిజనేతరులకు ఎన్నో సేవలందించారు. ఆయన స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లాలోని వీఆర్ పురం పరిధిలో ఉన్న అడవి వెంకన్న గూడెం. ఆయన సతీమణి లాలమ్మ 2018లో చనిపోయారు. కుంజా బొజ్జికి ఇద్దరు కుమారులు,ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయన మరణం పట్ల స్థానికులు,సీపీఎం నాయకులు,పలువురు ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+