తప్పుకు శిక్ష: చెల్లిపై లైంగికదాడి చేసిన అన్న, ఆత్మహత్య..
సొంత చెల్లె.. చిన్నమ్మ కూతురు అని కూడా కనికరించలేదు. లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం మీడియాలో రావడంతో ప్రపంచానికి తెలిసింది. కొన్నాళ్లుగా లైంగికదాడి చేసే సమయంలో సోయి లేదు. కానీ బయటకు రావడం.. కేసు ఫైల్ కావడంతో మాత్రం భయపడ్డాడు. ఇంకేముంది బలవన్మరణానికి పాల్పడ్డాడు. చేసిన తప్పుకు సరయిన శిక్ష పడిందని కొందరు అంటున్నారు.

చెల్లిపై లైంగికదాడి.. అన్న ఆత్మహత్య
చెల్లిపై అత్యాచారానికి పాల్పడిన యువకుడు అజయ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆమె అన్నతోపాటు, పెద్దమ్మ కుమారుడు అజయ్ కూడా కొన్నాళ్లుగా లైంగికదాడి చేశారు. ఘటనపై కొత్తగూడెం టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు కావడంతో అజయ్ భయపడ్డాడు. ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అమ్మ చెల్లితో కలిసి ఉంటూ..
భద్రాద్రి జిల్లా రామవరంలో ఈ ఘటన జరిగింది. మణుగూరుకు చెందిన ఓ వ్యక్తి కొత్తగూడెంలోని సింగరేణిలో రెస్క్యూ విభాగంలో పని చేస్తున్నాడు. చిన్నప్పుడే నాన్న వదిలివెళ్లడంతో అమ్మ, చెల్లెలి (20)తో కలిసి ఉంటున్నాడు. చెల్లిపై కన్నేసి ఆమెను లోబర్చుకొని.. శారీరకంగా హింసిస్తున్నాడు. అన్న అఘాయిత్యం గురించి తల్లికి చెప్పినా ఫలితం లేకపోవడంతో బాధితురాలు, తన పెద్దమ్మ ఇంటికి వెళ్లింది. అక్కడా ఆమె కొడుకు నరకం చూపించాడు.
Recommended Video

పట్టించుకోని తల్లి, పెద్దమ్మ
కన్నతల్లికి, పెద్దమ్మ కుటుంబసభ్యులకు చెప్పినా పట్టించుకోలేదు. గత్యంతరం లేక స్నేహితులు, గతంలో తనకు విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. విషయాన్ని బయటపెడితే చంపుతామని బెదిరిస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని బాధితురాలు వాపోయింది. ఘటనకు సంబంధించి బాధితురాలి సోదరుడు, ఆమె తల్లి, పెద్దమ్మ భర్త, పెద్దమ్మ కుమారుడు, పెద్దమ్మలపై నిర్భయ కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. కానీ వెంటనే భయపడ్డ అజయ్ ఉరి వేసుకొని చనిపోయాడు. సొంత చెల్లిపై లైంగికదాడి చేసేప్పుడు మంచి చెడు తెలియలేదు. కానీ కేసు కావడంతో మాత్రం వణికిపోయాడు.


Click it and Unblock the Notifications