తుమ్మల హాట్ కామెంట్స్.. పార్టీని నాశనం చేద్దామని అనుకున్నారు..?

మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాట్ కామెంట్స్ చేశారు. పార్టీ, అభివృద్ది గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తన ప్రత్యర్థి లక్ష్యంగా కామెంట్స్ చేసినట్టు అర్థమవుతోంది. తన జిల్లా అభివృద్ది.. నియోజకవర్గాల డెవలప్ గురించి ఆలోచిస్తానని చెప్పారు. కానీ కొందరు పార్టీని నాశనం చేద్దామని అనుకున్నారని చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. వారెవరూ.. ఏం చేశారు అనే చర్చ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

రాజకీయాల్లో ఉన్నంత వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు అశ్వారావుపేట నియోజకవర్గాభివృద్ధి చేసే బాధ్యత తనదని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం అశ్వారావుపేటలో ఎమ్మెల్సీ తాత మధు అభినంధన సభలో ఆయన పాల్గొన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు కుట్రలు పన్నీ పార్టీని నాశనం చేద్దామని చూశారు. అయినా మీ అందరూ పార్టీ పరువు పోకుండా ఎమ్మెల్సీ తాత మధుని గెలిపించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు అని అన్నారు. తను మంత్రిగా ఉన్న సమయంలో అవకాశం వచ్చిన సందర్భంలో అశ్వారావుపేట అభివృద్ధి విషయంలో ప్రతి గ్రామానికి లింక్ రోడ్లు వేశానని వివరించారు.

ex minister tummala nageshwar rao made sensational comments

దేశంలో ఫామ్ ఆయిల్ హబ్‌గా అశ్వారావుపేట దమ్మపేట మండలాలు ఉండబోతున్నాయని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో అశ్వారావుపేట నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఎక్కడ జరగలేదని చెప్పారు. తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. భవిష్యత్‌లో కూడా అందరం కలిసి ప్రయాణం చేయాలని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో తుమ్మల నాగేశ్వరరావుతోపాటు నామా నాగేశ్వరరావు కూడా ఉన్నారు. ఆయన గత ఎన్నికల సమయంలో పార్టీలో చేరారు. వీరిద్దరికీ రాజకీయంగా వైరం ఉంది. టీడీపీలో ఉన్న సమయలో నామా నాగేశ్వరరావును.. ఎంపీగా తుమ్మల ఓడించారని బహిరంగంగానే ఆయన కామెంట్ చేశారు. అదీ సద్దుమణిగింది. తర్వాత టీఆర్ఎస్ పార్టీలో తొలుత తుమ్మల చేరారు. మంత్రి పదవీ కూడా చేపట్టారు. తర్వాత గత ఎన్నికల సమయంలో నామా నాగేశ్వరరావు చేరారు. దీంతో వీరిద్దరీ మధ్య కోల్డ్ వార్ అయితే జరుగుతుంది. అదీ మరోసారి బయటపడింది. తుమ్మల పేరు తీయకుండానే.. టార్గెట్ చేసి మాట్లాడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+