గొర్రెల పేరుతో దివాళా పిటిషన్.. అప్పు ఇచ్చినోళ్లకు అంతే సంగతి..!
ఖమ్మం : అధిక వడ్డీలు జనాలను నిలువునా ముంచుతున్నాయి. చారానా కోడికి బారానా మసాలా లాగా తయారవుతోంది పరిస్థితి. తీసుకున్న అసలు కొంచెమైతే.. కట్టే వడ్డీలు మాత్రం తడిసిమోపెడవుతున్నాయి. వ్యాపారం చేసి అప్పులు తీర్చేయొచ్చు అనుకుంటూ చాలామంది తెలిసినవారి దగ్గర అధిక వడ్డీలకు డబ్బులు తీసుకుంటూ ఇబ్బందుల పాలవుతున్నారు. అదే క్రమంలో ఒకతను గొర్రెలను పెంచడానికి అందినకాడికి అప్పులు జేసి ఇప్పుడు దివాళా పిటిషన్ పెట్టిన ఘటన ఖమ్మంలో వెలుగుచూసింది.
ఖమ్మం అర్బన్ మండలం కొత్తగూడెం గ్రామస్తుడు పేరం వెంకట రమణ గొర్రెలు కొని పెంచుతున్నాడు. వాటిని అలా పెంచుతూ కొంతకాలం తర్వాత అమ్మితే లాభాలు వస్తాయని ఆశించాడు. అలా బంధుమిత్రుల దగ్గర అప్పుసప్పు జేసి మరీ గొర్రెలు కొన్నాడు. అయితే కొన్ని రోజులకు ఆ గొర్రెలు మృత్యువాత పడ్డాయి. దాంతో అతడికి ఏమి చేయాలో తోచలేదు. అలా అప్పుల బాధతో చివరకు కోర్టును ఆశ్రయించాడు.

గొర్రెలు చనిపోయాయనే విషయం తెలిసి అప్పు ఇచ్చినోళ్లు వెంకట రమణపై వత్తిడి పెంచారట. తాము ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ పట్టుబట్టడంతో చివరకు ఐపీ (INSOLVANCY PETITION) పెట్టాడు. ఖమ్మం సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో 12 లక్షల 80 వేల రూపాయలకు దివాళా పిటిషన్ దాఖలు చేశాడు.
ఫిర్యాదుదారు తరపున మొత్తం పదహారు మందిని ప్రతివాదులుగా చూపించి న్యాయవాదులు బీశ రమేశ్, జి.వీరభద్రం ఐపీ పిటిషన్ పెట్టారు. అయితే గొర్రెల పేరుతో అప్పుజేసి ఇలా ఐపీ పెట్టడం ఖమ్మం జిల్లాలో చర్చానీయాంశమైంది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications