Mother and Daughter: ఎస్సై ఈవెంట్స్ లో అర్హత సాధించిన తల్లీకూతుళ్లు..
సాధించాలనే పట్టుదల ఉంటే వయస్సు కూడా అడ్డు రాదు దీన్ని అక్షరాల నిజం చేశారు ఓ మహిళ. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెన్నారం గ్రామానికి చెందిన తోళ్ల నాగమణి, తోళ్ల త్రిలోకిని తల్లీకూతుళ్లు. వీరిద్దరు తెలంగాణ ఎస్సై ఈవెంట్లో క్వాలిఫైయ్ అయ్యారు. వీరు పరుగు పందెం, లాంగ్ జంప్, షాట్ ఫుట్ విభాగాలలో పోటీ పడి మెయిన్స్ కు అర్హత సాధించారు.

నాగమణి
ఖమ్మం రూరల్ మండలం రామన్నపేటలో నిరుపేద కుటుంబంలో పుట్టిన నాగమణికి చిన్న వయస్సులోనే పెళ్లి అయింది. ఆమె పెళ్లికి చదువుపాటు, క్రీడల్లో మంచి ప్రావీణ్యం కనబరిచేది. ఆమెక్ క్రీడాల్లో పలు అవార్డులు కూడా వచ్చాయి. అత్తారింటికి వెళ్లినా.. నాగమణి భర్తను ఒప్పించి అంగన్ వాడి ఉద్యోగం సాధించారు. ఆ తర్వాత హోంగార్డుగా చేరారు. ఆ తర్వాత సివిల్ కానిస్టేబుల్ అయ్యారు. అయినా ఏదైనా సాధించాలన్న తపనతో నాగమణి ఎస్సై ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంది.

ఒకే రోజు, ఒకే బ్యాచ్
అదే సమయంలో ఆమె కూతురు కూడా ఎస్సై ఉద్యోగానికి దరఖాస్తు చేశారు. దీంతో ఇద్దరు కలిసి పోలీసు ఈవెంట్స్ కు వచ్చి అర్హత సాదించారు. వీళ్లిద్దరు ఒకే రోజు ఈవెంట్స్ కు రావడం, ఒకే బ్యాచ్ కావడంతో ఒకేసారి ఇద్దరు ఈవెంట్స్ క్వాలిఫైయ్ అయ్యారు. ఈ తల్లీకూతుళ్లను పోలీసులు, ఉన్నతాధికారులు, మిగతా అభ్యర్థులు మెచ్చుకున్నారు. అక్కడున్న వారు వెంటనే ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ తల్లీకూతుళ్లు ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయారు.

బెస్ట్ ఆఫ్ లక్ నాగమణి, త్రిలోకి
నాగమణి ప్రస్తుతం ములుగు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. వీరిద్దరు చివరి ఘట్టమైన మెయిన్స్ కు ప్రీపేర్ అవుతున్నారు. తాము కచ్చితంగా ఎస్సై జాబ్ ను సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ తల్లీకూతుళ్లను నెటిజన్స్ అభినందనల్లో ముంచెత్తారు. మీరు కూడా వీరికి ఆల్ ద బెస్ట్ చెప్పండి.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications