'దిశ' కేసు ..దోషులను ఉరి తియ్యాలి .. లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని విద్యార్థి హల్ చల్
షాద్ నగర్ సమీపంలో జరిగిన వెటర్నరీ వైద్యురాలి గ్యాంగ్ రేప్, హత్య తాలూకు ప్రకంపనలు ఇంకా దేశంలో కొనసాగుతూనే ఉన్నాయి. దిశ గ్యాంగ్ రేప్, హత్య నేపధ్యంలో దోషులను కఠినంగా శిక్షించాలని వారిని ఉరి తియ్యాలని లేదంటే తాను ఆత్మహత్య చేసుకుంటా అని ఓ విద్యార్ధి హంగామా సృష్టించాడు .
ఖమ్మం జిల్లాలోని వైరాలో రోహిత్ అనే డిగ్రీ విద్యార్థి 'దిశ' దోషులకు ఉరి శిక్ష వెయ్యాలని లేదంటే సూసైడ్ చేసుకుంటా అని మూడంతస్తుల భవనం పైకి ఎక్కి హల్ చల్ చేశాడు. వెటర్నరీ డాక్టర్ హత్య కేసులో నిందితులకు ఉరిశిక్ష అమలు చేయాలంటూ మూడు అంతస్తుల భవనం ఎక్కి దూకుతానని బెదిరించాడు. నిందితులకు ఉరిశిక్ష వెయ్యాలంటూ ఓ గ్రాడ్యుయేట్ విద్యార్ధి డిమాండ్ చేశారు.నిందితులను ఉరితీయకపోతే బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన అతన్ని క్రిందికి తీసుకురావటానికి పోలీసులు నానా తంటాలు పడ్డారు.
అత్యాచారం చేసి, కాల్చి చంపిన వారిని ఉరితీయాల్సిందేనని పట్టుబట్టిన రోహిత్ కు పోలీసులు నచ్చజెప్పారు. నిందితులను ఉరితీయకపోతే ఇక్కడ ఒక ప్రాణం పక్కాగా పోతుందని హెచ్చరించిన అతన్ని ఆ ప్రయత్నం నుండి విరమింపజేయటానికి పోలీసులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఐ హేట్ ఇండియా అని రోహిత్ చాలా ఉద్వేగంగా మాట్లాడాడు. ఆ హంతకులకు మరణ శిక్ష పడాల్సిందే ..మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో అది మీ ఇష్టం . ఈ సోసైటీలో బతకడానికి తనకు ఇష్టం లేదని చాలా ఆవేదనగా చెప్పాడు.

స్థానికులు, పోలీసులు మొత్తానికి చాలా సేపు ప్రయత్నం చేసి, అతనికి నచ్చజెప్పి క్రిందికి దిగేలా చేశారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో రోహిత్ కు కౌన్సిలింగ్ ఇచ్చి , తల్లిదండ్రులను పిలిపించి అప్పగించారు. దిశ అత్యాచారం, హత్య ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన నేపధ్యంలోనిందితులను ఉరితీయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దేశం మొత్తం ముక్త కంఠంతో నేరస్తులను ఉరి తియ్యాలని డిమాండ్ చేస్తుంది .












Click it and Unblock the Notifications