రూ.500 బెట్: నీకు అంత లేదులే అనడంతో గొడవ, లిక్కర్ సీసాతో దాడి..

వారిద్దరు ఒకరికొకరు తెలుసు. రాత్రి పూట మందు తాగుతున్నారు. కానీ ఫోన్‌లో లూడో గేమ్ ఆడుతున్నారు. ఆట ఆడే సమయంలో బెట్టు పెట్టడం గొడవకు కారణమైంది. రెండుసార్లు ఓడిపోయిన గోపి అనే వ్యక్తి.. మరొకరిపై మందు బాటిల్‌తో దాడి చేశాడు. దీంతో మరొకరు గాయపడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని భార్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ఖమ్మం జిల్లా బోనకల్‌కి చెందిన కోలా గోపి, వట్టికొండ నాగేశ్వరరావు ఇద్దరు యువకులు ఉన్నారు. సోమవారం రాత్రి గోపి, నాగేశ్వరరావు మద్యం సేవిస్తున్నారు. డ్రింక్ చేస్తూ వారు మొబైల్‌లో లూడో గేమ్ ఆడారు. అసలే మద్యం మత్తులో ఉన్న వారు బెట్టు కట్టి ఆడుతున్నారు. రూ.50 చొప్పున కట్టి ఆడగా... రెండుసార్లు నాగేశ్వరరావు గెలిచాడు. మూడోసారి రూ.500 అని గోపి అన్నాడు. నీకు అంత లేదు అని అనడంతో... గోపి అసహనానికి లోనయ్యాడు. అదే విషయం మీద గొడవపడ్డాడు.

two youth clashes with online game..

Recommended Video

    Viral Video : Bus Going Back Due To Heavy Winds In Khammam District

    ఇద్దరి మధ్య వాదన కూడా జరిగింది. కోపోద్రిక్తుడైన గోపి.. మందు సీసాతో నాగేశ్వరరావుపై దాడి చేశాడు. మందు సీసాతో మెడ, పొత్తి కడుపుపై అటాక్ చేశాడు. దీంతో నాగేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నాగేశ్వరరావు భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో బెట్టు కోసం జరిగిన డిస్కషన్ దాడి చేసేవరకు వెళ్లింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+