video:1000 మంది చేపలు పడుతున్నారు: సీఎం కేసీఆర్
వరంగల్ నుంచి భద్రాచలం వరకు రోడ్డుమార్గంలో ప్రత్యేక బస్సులో సీఎం కేసీఆర్ ప్రయాణించారు. వరదనీటిలో మునిగిపోయిన ములుగు, ఏటూరు నాగారం మీదుగా భద్రాచలం ట్రావెల్ చేశారు. సీఎంతోపాటు సీఎస్ సోమేశ్ కుమార్.. ఇతర ముఖ్యులు ఉన్నారు. వరంగల్ కటాక్షపూర్ గుండా బస్సు రాగా అక్కడ వాగుపై నీరు వెళుతుంది. అంతకుముందే పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. తర్వాత వారు ఓకే చెప్పగా బస్సు వెళ్లింది.
వెయ్యి మంది చేపలు పడుతున్నారు..
బస్సు వెళుతుండగా పక్కన కొందరు చేపలు పడుతున్నారు. ఓ వెయ్యి మంది ఇక్కడ చేపలు పడుతున్నారని కేసీఆర్ కామెంట్ చేశారు. కొత్త బ్రిడ్జి శాంక్షన్ అయ్యిందని, త్వరలో కడతామని చెప్పారు. భద్రాచలంలోని వరద ముంపు బాధిత కుటుంబాలకు రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. వరద సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడుతామన్నారు. ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలకు ఎత్తైన ప్రదేశంలో రూ. 1000 కోట్లతో కొత్త కాలనీ నిర్మిస్తామని సీఎం స్పష్టం చేశారు.
ముంపు ప్రాంతాల పరిశీలన
భద్రాచలంలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు. ఐటీడీఏలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. అనుహ్యంగా చాల ఏళ్ల తర్వాత వరదలు వచ్చాయి. భద్రాచలం, పినపాక నియోజకవర్గాలు చాలా దెబ్బతిన్నాయని తెలిపారు. పోలీసు, ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ దళాలు తక్షణమే సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కొత్తగూడెం, ఖమ్మం కలెక్టర్లు గొప్పగా పని చేసి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నానని కేసీఆర్ తెలిపారు. 7,274 కుటుంబాలను జిల్లా యంత్రాంగం పునరావాస కేంద్రాలకు తరలించిందని కేసీఆర్ చెప్పారు.
వెయ్యి కోట్లతో ఇళ్ల నిర్మాణం
భద్రాచలం పట్టణం వరద ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకుంటామని కేసీఆర్ స్పష్టం చేశారు. ముంపు ప్రాంతాల ప్రజలను మరో ప్రాంతానికి తరలించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సింగరేణి, ప్రభుత్వం కలిసి రూ. 1000 కోట్లతో రెండు, మూడు వేల ఇండ్ల కాలనీ నిర్మించబోతున్నామని వివరించారు. భద్రాచలం, పినపాకలో వరద బాధలు లేకుండా చర్యలు చేపడుతామని తెలిపారు. గోదావరికి 90 అడుగుల మేర వరద వచ్చినా ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతామని కేసీఆర్ స్పష్టం చేశారు. వరద ముంపునకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు. గోదావరికి 1986లో భారీ వరదలు వచ్చాయని.. మారిన పరిస్థితుల కారణంగా మళ్లీ అలాంటి వరదలు వచ్చే అవకాశం ఉందన్నారు.












Click it and Unblock the Notifications