Viral News: పెళ్లి కొడుకు ఒక్కడే.. కానీ పెళ్లికూతుళ్లు ఇద్దరు.. వైరల్ అవుతున్న పెళ్లి పత్రిక..

పెళ్లంటే అమ్మాయి, అబ్బాయి ఒకటైయ్యే గొప్ప కార్యక్రమం. కానీ ఓ పెళ్లిలో పెళ్లి కొడుకు ఇద్దరు పెళ్లి కూతుళ్లను పెళ్లి చేసుకోనున్నాడు. ఇందుకు సంబంధించిన పెళ్లి పత్రిక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పెళ్లి పత్రికకు సోషల్ మీడియాలో చాలా కామెంట్లు వస్తున్నాయి. ఒక్కరు దొరకడమే కష్టంగా ఉందంటే.. నీకు ఇద్దరా బ్రో అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి కొందరు ఇది చట్టవిరుద్ధమని కామెంట్ చేస్తున్నారు. ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎర్రబోరు గ్రామానికి చెందిన ముత్తయ్య, రామలక్ష్మి దంపతులకు కొడుకు సత్తిబాబు ఉన్నాడు. అతను అదే గ్రామానికి చెందిన సునీత, స్వప్న కుమారి అనే ఇద్దరు యువతులను ప్రేమించాడు. వారితో ఏడాదిగా కాపురం కూడా చేస్తున్నాడు సత్తిబాబు. సునీత, స్వప్నకు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు సంతానం ఉన్నారు. అయితే వీరి ఆచారం ప్రకారం పెళ్లికి ముందే కాపురం చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారట.

One Groom Two Brides On Wedding Invitation Card, the Card goes Viral in Social Media

ఇందులో భాగంగా సత్తిబాబు ఇద్దరు యువతులతో కాపురం చేసి వారినే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. పెళ్లి పత్రికలో చిరంజీవ సత్తిబాబు తో చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి స్వప్న కుమారి, సునీత అని ఉంది. ఈ శుభలేఖ చూసిన వారందరు ఆశ్చర్యపోతున్నారు. ఇదేమిటని ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే ఇది చట్ట విరుద్ధమని కొందరు చెబుతున్నారు. చూడాలి దీనిపై పోలీసులు ఏం చర్యలు తీసుకుంటారో..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+