రూ.25 లక్షలు వద్దు.. న్యాయం చేయండి, అబ్దుల్ సలామ్ అత్త, ఆ పోలీసులను విధుల నుంచి తొలగించాలని..
అబ్దుల్ సలామ్ అత్త మాబూ కఠిన నిర్ణయం తీసుకున్నారు. సలామ్ కుటుంబం సూసైడ్ చేసుకోవడంతో ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. రూ.25 లక్షలు అందజేస్తామని తెలిపింది. అయితే ఆ మొత్తం తీసుకునేందుకు మాబూ నిరాకరించారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. చేయని తప్పుకు వేధించడం వల్లే సలామ్ కుటుంబం బలవన్మరణానికి పాల్పడిందని చెప్పారు.

అసలు నిందితులకు శిక్ష..
బంగారం షాపులో చోరీ చేసిన అసలు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సలాం ఫ్యామిలీని వేధించిన సీఐ, హెడ్ కానిస్టేబుల్‌కు బెయిల్ రద్దు చేసి జైలుకు పంపాలని కోరారు. వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని మాబూని డిమాండ్ చేశారు. ఇటు నంద్యాలలో మహిళా ఎస్‌ఐ, కానిస్టేబుల్ రాత్రి 10 గంటలకు అబ్దుల్ సలాం ఇంటికి వెళ్లారు. తెల్లకాగితంపై సంతకం చేయాలని పోలీసులు అబ్దుల్ సలాం అత్తపై ఒత్తిడి తీసుకొచ్చారు. భయంతో సబ్ కలెక్టర్ కల్పనా కుమారికి అబ్దుల్ సలాం అత్త ఫోన్ చేశాడు. సబ్ కలెక్టర్ జోక్యంతో పోలీసులు వెనక్కు వెళ్లిపోయారు.

సీఐ, హెడ్ కానిస్టేబుల్..
కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ ఆదివారం అరెస్ట్ చేశారు. దొంగతనం కేసుకు సంబంధించి పోలీసులు వేధించారని అబ్దుల్ సలాం కుటుంబ సభ్యులతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు పోలీసుల తీరును వివరిస్తూ సెల్పీ వీడియో షూట్ చేశాడు.

వీడియో వైరల్..
కుటుంబం సామూహిక ఆత్మహత్య తర్వాత వీడియో పోలీసులకు లభించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరలయ్యింది. కేసుతో సంబంధం ఉన్న సీఐ, హెడ్ కానిస్టేబుల్‌ను విధుల నుంచి తప్పించారు. సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్‌ను కోర్టులో హాజరుపరచగా నంద్యాల జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు వారం రోజులు రిమాండ్ విధించింది. వారు దాఖలు చేసిన పిటిషన్ మేరకు ఇద్దరి పూచికత్తుతో బెయిల్ మంజూరు చేసింది.
-
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
ఓపెనర్ గా అభిషేక్ స్థానంలో - ఫైనల్ లో భారీ ట్విస్ట్, ఫలించేనా..!! -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..! -
ఫైనల్ మ్యాచ్ వర్షం లో కొట్టుకుపోతే, ఛాంపియన్ ఎవరు - ఐసీసీ తాజా రూల్స్..!! -
కోనసీమ వాసుల కల నెరవేర్చే కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ లో కీలక అడుగు -
LPG price hike: గ్యాస్ ధరల షాక్-నేటి నుంచి ఒక్కో సిలిండర్ పై పెంపు ఇలా..! -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
`ఉస్తాద్` విషయంలో తెలిసి చేశారో తెలియక చేశారో గానీ.. !!












Click it and Unblock the Notifications