విషాదం: రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత నీరజారెడ్డి మృతి
కర్నూలు: జిల్లాలోని ఆలూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత పాటిల్ నీరజారెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా బీచుపల్లి వద్ద కారు టైర్ పేలి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో నీరజారెడ్డి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆమెను కర్నూలు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మాజీ ఎమ్మెల్యే నీరజా రెడ్డి(Niraja Reddy) తుది శ్వాస విడిచారు. నీరజా రెడ్డి భర్త శేషిరెడ్డి గతంలో పత్తికొండ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఫ్యాక్షన్ గొడవల్లో ఆయన హత్యకు గురయ్యారు. నీరజారెడ్డికి ఒక కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం ఆమె అమెరికాలో ఉంటున్నారు.

నీరజా రెడ్డి 2009 నుంచి 2014 వరకు ఆలూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. అంతకుముందు పత్తికొండ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా దేవరకొండ మండలం ఆలూరు నియోజకవర్గంలో చేరడంతో 2009లో ఆలూరులో కాంగ్రెస్ తరపున బరిలో దిగారు. ఆ తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీలో ఇమడలేక ప్రస్తుతం బీజేపీలో చేరి.. ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు.












Click it and Unblock the Notifications