ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: ఆలూరు నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా ఆలూరు జ‌న‌ర‌ల్ స్థానంగా మారింది. ఇక్క‌డి నుండి మ‌సాల ఈర‌న్న మూడు సార్లు గెలిచారు. ఇక్క‌డి నుండి రెండు సార్లు గెలిచిన ఎం మారెప్ప వైయ‌స్ క్యాబినెట్ లో మంత్రిగా ప‌ని చేసారు. ఒక జ‌డ్‌పిటిసి ఎన్నిక‌లో ఓడిపోయినందుకు ఆయ‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయాల్సి వ‌చ్చింది. 2009 లో ఇక్క‌డ గెలిచిన నీర‌జా రెడ్డి గ‌తంలో ప‌త్తికొండ లో పోటీ చేసి గెలిచారు. 2009 లో మ‌హా కూట‌మి అభ్య‌ర్ధిగా ప్ర‌స్తుత సిపిఐ ఏపి రాష్ట్ర కార్య‌ద‌ర్శిగా ఉన్న రామ‌కృష్ణ పోటీ చేసి మూడో స్థానానికి ప‌రిమితం అయ్యారు. 2014 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్ధిగా కోట్ల సుజాత‌మ్మ పోటి చేసి 22193 ఓట్లు సాధించి డిపాజిట్ ద‌క్కించుకున్నారు. 2009 ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌రాజ్యం అభ్య‌ర్ధిగా పోటీ చేసిన జి జ‌య‌రామ్ ఆ త‌రువాత వైసిపి లో చేరారు.

14 సార్లు ఎన్నిక‌లు..
ఆలూరు నియోజ‌క‌వ‌ర్గంలో 2014 వ‌ర‌కు మొత్తం 14 సార్లు ఎన్నిక‌లు జ‌రిగాయి. అందులో కాంగ్రెస్ తొమ్మిది సార్లు, టిడిపి మూడు సార్లు, వైసిపి ఒక సారి, స్వ‌తంత్ర పార్టీ ఒక‌సారి గెలుపొందాయి. 2009 ఎన్నిక‌ల్లో గెలిచిన నీర‌జా రెడ్డి 2014 ఎన్నిక‌ల స‌మ‌యాన మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై స‌మైక్యాంధ్ర పార్ట‌లో ఉన్నారు. కానీ, ఆ ఎన్నిక‌ల్లో మా త్రం పోటీ చేయ‌లేదు. ఇక‌, ప్ర‌జారాజ్యం పార్టీలో ఉన్న జి జ‌య‌రాం 2014 ఎన్నిక‌ల ముందు వైసిపి లో చేరి ఆలూరు నియో జ‌కవ‌ర్గం నుండి పోటీ చేసారు. ఆలూరు నియోజ‌క‌వ‌ర్గం క‌ర్నూలు లోక్‌స‌భ ప‌రిధిలో ఉంది.

#AndhraPradeshElections2019: All about Alur Constituency

2014 ఎన్నిక‌ల్లో వైసిపి గెలుపు..
2014 ఎన్నిక‌ల్లో ఆలూరు నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం 219023 ఓట్లు ఉండ‌గా, అందులో 169423 ఓట్లు పోల‌య్యాయి. వైసిపి నుండి పోటీ చేసిన జ‌య‌రాం కు 69466 ఓట్లు రాగా, టిడిపి నుండి పోటీ చేసిన వీర‌భ‌ద్ర గౌడ్ కు 67547 ఓట్లు వ‌చ్చాయి. ఈ ఎన్నిక‌ల్లో వైసిపి అభ్య‌ర్ది జ‌య‌రాం 1919 ఓట్ల మెజార్టీ తో గెలుపొందారు. 2009 లో ప్ర‌జారాజ్యం నుండి పోటీ చేసిన జ‌య రాం 37277 ఓట్లు ద‌క్కించుకున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో పూర్తి ప‌ట్టుకోసం ప్ర‌య‌త్నిస్తున్న ప్ర‌ధాన పార్టీల అభ్య‌ర్ధులు 2014 ఎన్నిక‌ల త‌రువాత మ‌రోసారి గెలుపు కోసం ప్ర‌య‌త్నాలు ప్రారంభించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+