వీరేం.. నీచులురా బాబు.. అమ్మవారి విగ్రహాన్ని పెకిలించి మరీ తవ్వకాలు.. ఎక్కడ అంటే..?

ఈ కాలంలో కూడా గుప్త నిధులు ఉన్నాయని నమ్ముతారు. దాని కోసం బలులు ఇస్తుంటారు. నర బలి ఆశ్చర్యం కలిగిస్తోంది. వారికి నిధులు ఇంపార్టెంట్ అయినందున.. అమావాస్య రోజున.. ఇతర రోజులు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. వాస్తవానికి దీనిపై చాలా మంది అవగాహన కల్పిస్తోన్న కొందరిలో మార్పు రావడం లేదు. అయితే గ్రామ దేవతల విగ్రహాలను తీయడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది.

క‌ర్నూలు జిల్లా ప‌త్తికొండ‌లో గుప్త నిధుల కోసం త‌వ్వ‌కాలు జరిపారు. ప‌త్తికొండ మండ‌లంలో శ్రీకృష్ణ దేవరాయలు నాటి రాజులమండగిరి గ్రామ సమీపంలో గుప్తనిధుల కోసం అర్ధరాత్రి తవ్వకాలు జరిపారు. గ్రామ సమీపంలో రాజుల‌మండ‌గిరిలో బుగల అమ్మ గ్రామ దేవత ఉంది. అయితే అమ్మవారి విగ్రహాన్ని పెకిలించి గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. ఇదీ ఆశ్చర్యం కలిగిస్తోంది. వారికి దేవుడిపై ఎలాంటి సెంటిమెంట్ లేదని అనిపిస్తోంది. అందుకోసమే ఇలా ప్రవర్తించారని అవగతం అవుతుంది.

excavations for hidden treasures in kurnool pathikonda

గుప్త నిధుల కోసం పురాతన దేవాలయాను టార్గెట్ గా చేసుకున్నారు. అందుకోసమే తవ్వకాలు జరుపుతున్నారు. పురాతన విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. పురాతన ఆనవాళ్లు కనుమరుగు చేస్తున్నారు. అర్ధరాత్రి గుప్తనిధుల కోసం గుర్తుతెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపారని గ్రామస్తులు అంటున్నారు. దీనిపై స్థానికులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. వీరి ఆగడాలతో పురాతన ఆనవాళ్లు కనుమరుగు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గుప్త‌నిధుల తవ్వ‌కాలు ఎవ‌రు జ‌రిపార‌ు? వారు ఎవరు? ఎక్కడనుంచి వచ్చారు? ఈ ముఠా వెనుక ఎవరన్నా ఉన్నారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ గుప్త నిధుల తవ్వకాల విష‌యంపై మండ‌లంలో పెద్ద చ‌ర్చ‌ జరుగుతుంది. ఘటనపై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. దుండగులు అమ్మవారి విగ్రహాం ఉందని కూడా భయపడలేదు. తమకు బంగారం, ఆభరణాలు.. వజ్రాలు, వైఢుర్యాలు దొరుతాయోమోనని ఆశ పడ్డారు. అందుకోసం దేవత ప్రతిమను కూడా లెక్కచేయలేదు. దీనిని స్థానికులు తప్పుపడుతున్నారు. తమ ఇలవేల్పు గురించి ఇలా చేయడం ఏమిటిని మండిపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+