Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కర్నూలు మహిళకు దొరికిన విలువైన వజ్రం... టమాటా నారు నాటుతుండగా...

కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం జొన్నగిరికి చెందిన ఓ మహిళా వ్యవసాయ కూలీకి విలువైన వజ్రం లభించింది. ఆదివారం(జూన్ 26) టమాటా నారు నాటుతుండగా దుక్కుల్లో ఆ వజ్రం లభించినట్లు తెలుస్తోంది. స్థానిక వ్యాపారి ఒకరు ఆ వజ్రాన్ని రూ.6లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం వందలాది మంది స్థానికులు అక్కడ వజ్రాన్వేషణలో తమ అదృష్ఠాన్ని పరీక్షించుకుంటున్నారు.

తొలకరి జల్లులు పడ్డాయంటే చాలు కర్నూలు జిల్లాలోని పొలాల్లో వజ్రాల వేట మొదలవుతుంది. ముఖ్యంగా జొన్నగిరి,పగిడిరాయి,ఎర్రగుడి,మద్దికెర ప్రాంతాల్లోని ఎర్ర నేలల్లో వజ్రాల వేట ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సమేతంగా చాలామంది ఇక్కడి పొలాల్లో వజ్రాన్వేషణ కొనసాగిస్తారు. ఈ క్రమంలో కొంతమందికి వజ్రాలు లభిస్తుండగా... స్థానిక వ్యాపారులు తక్కువ ధరకే వాటిని కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్లో రూ.కోట్ల విలువ చేసే వజ్రాలను ఇలా తక్కువ ధరకే కొనుగోలు చేసి అమాయకులను దోపిడీ చేస్తున్నారన్న విమర్శలున్నాయి.

గతంలోనూ ఇక్కడి పొలాల్లో చాలామందికి వజ్రాలు లభించాయి. ఇటీవల ఓ రైతుకు రూ.1కోటి పైచిలుకు విలువ చేసే వజ్రం దొరికింది. గత మే నెల 17వ తేదీన చిన్నజొన్నగిరి ప్రాంతానికి చెందిన ఓ మహిళకు 30 క్యారెట్ల వజ్రం దొరికింది. ఆ మరుసటిరోజే మరో మహిళకూ వజ్రం లభించింది. అయితే ఈ వజ్రాలను కేవలం రూ.40వేలు,రూ.70వేలకే విక్రయించినట్లు తెలుస్తోంది.

kurnool woman found a diamond while working in farm field

రాయలసీమ ప్రాంతంలో వజ్రాల లభ్యతకు సంబంధించి ఆసక్తికర కథనాలు ప్రచారంలో ఉన్నాయి. రాయలు ఏలిన కాలంలో వజ్రాలను వీధుల్లో రాశులుగా పోసి అమ్మేవారని... అశోకుడి పాలనలో వజ్రాలను విస్తారంగా వెదజల్లారని చెబుతారు. అందుకే ఈ ప్రాంతానికి సువర్ణగిరిగా పేరు వచ్చిందని... కాల క్రమంలో అది జొన్నగిరిగా మారిందని అంటారు.

పత్తికొండ నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో వజ్రాల లభ్యత ఎక్కువగా ఉంటుందని చెబుతారు. ఎండాకాలం తర్వాత వచ్చే తొలకరి వర్షాలకు నేల లోపలి నుంచి ఈ వజ్రాలు బయటకొస్తాయని చెబుతారు. అందుకే తొలకరి వర్షాలు పడగానే వందలాది మంది జనాలు ఇక్కడి పంట పొలాల్లో వజ్రాన్వేషణలో మునిగిపోతారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+